హైదరాబాదు To సింగపూరు!
March 27, 2007
“ఇంకొక్క రెందేళ్ళు ఓపిక పట్టండి… మన భాగ్య నగరం సింగపూర్ తొ పోటీ పడుతుంది”.. అని సెలవిచ్చారు మన ముఖ్యమంత్రివర్యులు! అయితే, అది ఏ విషయంలోనా అని నాకు సందేహం వస్తోంది! ఇప్పటికే మన రాజధాని చాలా విషయలలో ముందంజలో ఉంది..
నగరం లో ఉన్న ప్రధాన రోద్లలో drive చెయ్యాలంటే భయం.. traffic, కాలుష్యం… (కొన్ని రోజుల క్రిందట ఈనాడు లొ హైదరాబాద్ lo pollution level ఉండాల్సిన దానికంటే ఎన్ని “రెట్లు” ఎక్కువ ఉందో article వచ్చింది) పొనీలే బయటకి పోకుందా ఇంట్లోనే పడి ఉందాం అంటె… మన MCH వాళ్ళకి పరిసరాల పరిశుభ్రత మీద చాల ధ్యాస ఎక్కువాయె.. ఒక్కోసారి dengue, ఇంకొక సారి hepatitis…వీటి భయాలు… ఇవన్నీ కాక, నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, కరెంట్ ఎప్పుదు పోతుందో తెలియదు….!!
Pessimistic గా మాట్లాడుతున్నా అనుకోవద్దు…. కానీ, ఒక నగరం అభివృధ్ధి చెందాలి అంటే, ముందు basic amenities/requirements తీర్చాలి నా అభిప్రాయం ప్రకారం… రింగు రోడ్లు, వాటి చుట్టూ ప్లాట్లు కడితే అవి రావు గదా….!! వచ్చే పదేళ్ళ లోపు ఆంధ్ర దేశం లో ఉన్న జనాభా లొ 8% ఇక్కడ ఉంటారు అంటే వలస లు ఎంత తీవ్ర స్థాయి లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు… globalization, IT boom, కారణాలు ఏవైనా అనుకోండి.. basic needs తీర్చగలిగినప్పుడే మన నగరం అంతర్జాతీయ స్థాయికి చేరగలుగుతుంది…
Entry Filed under: రాజకీయం. .



Trackback this post | Subscribe to the comments via RSS Feed