Archive for April, 2007

బ్యాచిలరోపాఖ్యానం – 1

(ఎప్పటికైనా ఒక కథ రాయాలి అని నా కోరిక, అదీ తెలుగు లో.. చాలా రోజులనుంచి ఉన్నదే లెండి.. ముందు పుస్తకాల్లో బరుకుతూ ఉండే వాడిని.. ఈ బ్లాగులొచ్చాక, ఇక్కడ బరుకుతున్నా… ఇది నా మొదటి కథ.. అందువల్ల ముందే మీకీ హెచ్చరిక… :) చదవగానే నాకు అంత అద్భుతంగా ఏమీ అనిపించలేదు… కానీ ధైర్యం చేసి రాయకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, నెమ్మదిగా మెరుగుపరుచుకోవచ్చులే అని నా బ్లాగులో పెట్టేస్తున్నా…. సూచనలుంటే తప్పకుండా ఇవ్వండి… )

“రేయ్! పెళ్ళి చేసుకోవడం ఈజీనా, ఇల్లు కొనడం ఈజీనా?” అడిగాడు అవినాష్ సురేష్ ని. “రెండూ కష్టమే అనుకుంటాన్రా”, అన్నాడు సురేష్ తీవ్రంగా అలోచించి. “ఛీ నిన్ను అడిగాను చూడు.. కాని ఆ రెండిట్లో ఎదో ఒకటి చెయ్యకపోతే మనం ఉండడానికీ ఊళ్ళో ఫుట్ పాథ్ లూ చెట్లూ శరణ్యమేమోరా?” భయంగా అన్నాడు… “ఛ.. ఇంత చిన్న విషయానికి, అంత పెద్ద పెద్ద తప్పులు చెయ్యక్కర్లేదు లేరా… ఇంకాస్తఓపిక పట్టు, దొరికేస్తుంది..” ఆశావాది సురేష్ అన్నాడు…

అవినాష్, సురేష్ కాలేజీ లో మంచి స్నేహితులు. ఈమధ్యే ఇద్దరికీ క్యాంపస్ ఇంటర్ వ్యూ లలో ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది.. ఆఫీసు భాగ్యనగరం లో అని తెలిసింది.. ఆహా… మన రాజధానిలోనే కదా.. ఎంత అదృష్టం.. అనుకుని మురిసిపోయారిద్దరూ.. ఒక మూడ్రోజులు ముందే కంపెనీ ఇచ్చిన హోటల్ లో దిగి, ఇళ్ళు వెతకటం మొదలెట్టారు.. కానీ హైద్రాబాద్ లో ‘బ్యాచిలర్స్’ అనబడే బ్రహ్మచారులకి ఇళ్ళు దొరకటం ఎంత కష్టమో కొన్నాళ్ళు వెతికితేగానీ అర్ధం కాలేదు వాళ్ళకి పాపం…

ఆఫీసుకి దగ్గరలో ఉంటుంది కదా అని బేగంపేటలో ప్రారంభించారు వేట. టులెట్ బోర్డులు చాలానే ఉన్నాయి కానీ, చాలా వాటి క్రింద “ఓన్లీ ఫ్యామిలీ” అని రాసి ఉంది. కొన్ని అపార్ట్ మెంట్లలో ‘టులెట్’ ఒక్కటే ఉన్నా, వాచ్ మెన్ గాడు రెంట్కి ఉందికానీ ఫ్యామిలీస్ కి మాత్రమే అని చెప్పేసేవాడు. అంటే ఈ ‘ఫ్యామిలీ’ బోర్డులవాళ్ళు కనీసం మిగిలినవాళ్ళ మొహాలు చూడ్డానిక్కూడా సిద్ఢంగా లేరన్నమాట… ఇంకేం చెస్తాం అనుకుని మిగిలిన ఒకటీ అరా బోర్డుల వెంట పడ్డారు…

అదృష్తం బావుండి ఓ అపార్ట్ మెంట్ లో ‘టులెట్’ కనిపించింది, కింద కండిషన్లేం లేకుండా.. వాచ్ మెన్ గాడు బైటికి పోయినట్టున్నాడు.. ఇదే అదను, ముందు లోపలికెళ్తే, మాట్లాడి ఎలాగోలా ఒప్పించచ్చు అనుకుని లోపలికి దూరారు..మెట్లెక్కి పైకెళ్తుంటే, గుప్పుమని కొట్టింది సిగరెట్ కంపు.. పక్కన ఓ ఇద్దరు పొగరాయుళ్ళు బాతాఖానీ లో ఉన్నారు… మంచి ఊపు మీద గుప్పు గుప్పు మనిపిస్తున్నారు.. ఇంకాస్త పైకి వెళ్తే, ఇంకొకడు పైఫ్లోర్ నుంచి కిందికి దొంగ చూపులు చూస్తున్నాడు.. మొత్తానికి వీళ్ళందర్నీ దాటుకుని ఆ అపార్ట్ మెంట్ బెల్ నొక్కారు… లోపల్నుంచే గమనించినట్టున్నారు.. ‘ఎవరూ’, అన్నారు… ‘ఇల్లు గురించండీ, బైట బోర్డు పెట్టారు కదా’.. కాసేపయ్యాక తలుపు తీసిందొక మధ్యవయస్కురాలు. వీళ్ళ మొహాలు చూదగానే అడగాల్సింది అడిగేసింది ‘ఫ్యామిలీయా?’… ‘అంటే, మా పేరెంట్స్ వస్తూ ఉంటారండి.. మేం ఇద్దరం….’, ‘బ్యాచిలర్సా?’ కట్ చేస్తూ సూటిగా అదిగింది.. ‘బ్యాచిలర్సేనండి.. కానీ…’.. మిగిలింది వినలేదు…’ఈ అపార్ట్ మెంట్లో ఎక్కడా బ్యాచిలర్స్ కి ఇవ్వరు.. ఇక్కదంతా పద్ధతిగా ఉంటుంది.. రాత్రి 10 కల్లా గేటు మూసేస్తారు… ఒరేయ్ పుల్లయ్యా.. ఎక్కడున్నావ్ రా? బ్యాచిలర్స్ అంటే లోపలికి పంపొద్దని చెప్పానా?’.. వీళ్ళకర్ధమైపోయింది.. బైటకి నడిచారు ఉసూరంటూ.. ‘అవునూ, ఇందాకా చూసిన కొంటె కృష్ణుళ్ళూ, పొగరాయుళ్ళూ కూడా ఫ్యామిలీసే నంటావా?’, అడిగాదు రాజేష్.. ‘తొక్కలో ప్రశ్నలు అడక్కుబే… ఈ అపార్ట్ మెంట్ మన లిస్ట్ లో లేదంతే..’

‘ఫ్యామిలీ ఓన్లీ’ అని రాసున్న బోర్డు ఉన్న ఇళ్ళకు వెళ్ళారో.. తిట్లు పడటం ఖాయం అయిపోయింది. ఓ బోర్డు కింద ఫ్యామిలీ అని రాసున్నా, లోపలికి వెళ్ళిపోయి బేరాలాడటం మొదలెట్టారు. ఓనర్లు ముందు చాలా మంచిగా మాట్లాడారు. ఇల్లంతా చూపించారు. “అద్దెంతండీ?”, “రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్… ఆరు వేలు… ఇంతకీ ఎవరెవరుంటారు?”, “అదండీ.. “, “బైట బోర్డు మీద రాశాం కూడా కదా? అర్ఢం కాదు జనాలకి, మా టైం వేస్ట్ చెయ్యడానిక్కాకపోతే..”, హఠాత్తుగా గొంతు మారిపోయింది. ఆ ఇంట్లోంచి వెంటనే బైట పడి, ఇదే మన ఆఖరి ‘ఫ్యామిలీ ఓన్లీ’ ఇల్లని డిసైడ్ చేసారు.

“మరెలాగరా?” అన్నాడు రాజేష్. “బ్రోకర్లుంటారేమో ట్రై చేద్దాం పద..” అన్నాడు అవినాష్. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్టు, ఇక్కడా అదే ప్రశ్న…”బ్యాచిలర్సా?”. గోవా ఖైనీ నముల్తూ, నల్లటి మొహానికి పచ్చటి పళ్ళు అతికించినట్టున్నాడు. మోటార్ ఇంజిన్ లాగ సౌండ్ చేసాడు ఆ బ్రోకరు.. “ఇల్లు చూపించాలంటే రెండొందలు ముందు ఇవ్వాలి”, “చూసిన తర్వాత ఆ ఇల్లు నచ్చకపోతే?”, “ఈ డబ్బు ఇల్లు చూపించడానికే..”, తారు డబ్బా లో రాళ్ళు వేసినట్టు నవ్వాడు. సరే అని వాడికి ఆ డబ్బు సమర్పించుకుని వాడు తీస్కెళ్ళిన ఓ ఇంటికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఓనరు తో ఏదో మాట్లాడి బైటికి వచ్చి, “అద్దె పది వేలు” అన్నాడు. “ఇలాంటి ఇల్లు మేం ఆరు వేలకే చూశాం”. ‘ఛా! మీకిస్తారనుకుంటున్నారా’, అన్నట్టు ఓ లుక్కు పడేసి, “అయితే వెళ్ళి అందులోనే ఉండండి” అన్నాడు వెటకారంగా. “అలా కాదు బాబూ, పది వేలంటే మరీ ఎక్కువ కదా..”, కాళ్ళ బేరానికొచ్చారు. “తొమ్మిదికి తక్కువ అయితే బ్యాచిలర్స్ కి ఇక్కడ లేవు సారూ”, కొద్దిగా గౌరవంగా అయినా ఖరాఖండి గా చెప్పేశాదు.

“అసలు బ్యాచిలర్స్ చేసిన తప్పేంట్రా.. వీళ్ళంతా ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా? హు.. నేను ఇల్లు గనక కొంటే , దానిని అద్దె కి ఇస్తే, ‘బ్యాచిలర్స్ ఓన్లీ’ అని బోర్డు పెడతా”, ఆవేశపడ్డాడు అవినాష్. “సర్లే.. అలాగే చేద్దువుగాని. కానీ భవిష్యత్తు గురించి తర్వాత… వర్తమానం గురించి అలోచించుబాబూ… రెండ్రోజుల్లో చేరాలి జాబ్ లో.. ఆ తర్వాత అస్సలు టైం దొరకదు..” తొందరపెట్టాదు రాజేష్.

* * *

“ఇదీ మా పరిస్ఠితి. హైద్రాబాద్ లో బ్యాచిలర్స్ అంటె క్విట్ ఇండియా టైపులో ఇంత వ్యతిరేకత ఉందని తెలియలేదు. ఇప్పుడు నువ్వే మాకో దారి చూపించాలి..”, మిత్ర ద్వయం తమ బాధని దాసుతో చెప్పుకున్నారు. దాస్ వీళ్ళ కంటే ఓ రెండేళ్ళు ముందు హైద్రాబాదుకొచ్చి తిష్ట వేసిన మరో బ్యాచిలర్… హైద్రాబాద్ ఓనర్లగురించి ఓ రెండాకులు ఎక్కువే చదివాడు. వీళ్ళకి సూపర్ సీనియర్. జ్ఞాన బోధ మొదలెట్టాదు, “జన్రల్ గా బ్యాచిలర్స్ అనగానే ఎక్కడ ఇల్లు సరిగ్గా చూడరో అని భయం ఉంటుంది. చాలా మంది బ్యాచిలర్స్ ఇల్లు సరిగా చూసుకున్నా కూడా, ఇదొక మిస్ కన్సెప్షన్ మరి. అందువల్ల, ఈ ఓనర్లకి నమ్మకం కలగాలి అంటే, ‘తెలిసున్న ఫ్యామిలీ’ అనే ఆస్త్రాన్ని వాళ్ళ మీద వెయ్యాలి!”, “అంటే?”, అర్ధంకాక అడిగాడు రాజేష్. “మీకు ఈ ఊళ్ళో తెలిసిన ఫ్యామిలీలు ఎవరైనా ఉన్నారా?”, “ప్చ్.. ఈ మహానగరం లో మాకు తెలిసున్న వాడివి నువ్వొక్కడివే!”, “సర్లెండి… మా వాడొకడు ఈ మధ్యే పెళ్ళి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టాడు.. వాళ్ళే మీ అక్క, బావ అని చెప్పండి. ఇళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళి మాట్లాడిపిద్దాం..”, “దాసూ, నువ్వే మాకు బాసు.. నీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేం..!” ఇద్దరూ ఒకే సారి అరిచినంత పని చేసారు. “బాబులూ, మీరు బుద్ధిమంతులని తెలుసు కాబట్టే ఇంత రిస్క్ తీసుకుంటున్నా.. మా వాళ్ళు వచ్చిన టైం లో అమ్మాయిల వైపు పిచ్చి చూపులు చూడటం లాంటి వెధవ పనులు చేసారో, ముందు నాకు, తర్వాత మీకు బాజా అయిపోతుంది..జాగ్రత్త” అని హెచరించాడు దాసు. “అప్పుడెందుకు చూస్తాం, తీరిగ్గా తర్వాత చూసుకుంటాంలే..”, లోపల అనుకున్నారిద్దరూ వేర్వేరుగా…

చివరికి ఆ విధంగా, ముల్లుని ముల్లుతోనేతీయాలనే సామెత ఆధారంగా, ఫ్యామిలీ ని ఫ్యామిలీతో నే ఇంప్రెస్ చేసి, భాగ్యనగరంలో ఇల్లు సంపాదించారు ఆ మిత్రద్వయం..

P.S.: ప్రపంచీకరణ యొక్క చెడు ఫలితాలు నా తెలుగు లో ఇంగ్లీషులా బయట పడుతున్నాయి. భాషాభిమానులు నన్ను క్షమించాలి! :)

10 comments April 29, 2007

Can this be a solution?

Today I went to my college (IIIT Hyderabad) and located groups of new faces wearing suits and walking around busily. When asked, I found that they are students of special program organized by one of the Directors of the college (I think Dr. Raj Reddy). All those people are from remote areas of Andhra Pradesh. Students from various undeveloped areas are selected, they are brought here for a full year for this course. As I understand, the aim of this course is to make them suited for the current day’s ‘hot’ IT/BPO jobs. Students are selected based on a screening test, and those who did well in the test are given seats for free. Mind you, people are not discriminated by their social backwardness. Not to mention, people got selected from all three regions of AP..! :) Many of them are bright students who stopped studying due to weak economic conditions. Essentially the entry criteria was how a student performed in his 10th or 12th, the entrance test score and his economic situation.

I talked to some of the students who are studying there. Their schedule is really hectic. Classes spawn from Morning till night. Attendance and Uniform are must. They said that this course was extremely useful. I believe this kind of initiative will be really helpful.

Now, this is my question. Can our government and the political parties can even think of this kind of solution for the upliftment of the backward people of India? How on the earth will the 100+ seats in IIMs help the uplifting of crores of backward people? Why do the political parties fear doing it? They cannot survive, if there does not exist tensions between different social groups. If everyone in India is well educated and sensible citizens, they cannot rig the elections and bribe the voters to win..

Are these the reasons? I do not know.

Add comment April 28, 2007

జీవో ఆరొందల పది!!

ఇందులో ఈ జీవో ని నేను ప్రశ్నించను.. దాని ఉద్దేశ్యం సరైనదే అనుకుంటాను.. కానీ దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఇచిన నిబంధన ఒకటి నాకు వింతగా అనిపించింది…!!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకొవాలి.. కాబట్టి, 4 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ ఎక్కడ చదివితే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వారట… ఇందులో వచే చిక్కుల గురించి ప్రభుత్వం ఆలోచించలేదా?! ఎప్పుదో చిన్నప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళ తల్లిదంద్రులు ఎదో ఒక ప్రాంతం లో ఉండడం వల్ల ఆ ప్రాంతం లొ చదివితే, వాళ్ళు ఆ ప్రాంతీయులైపోతారా?! మరి వేరే ప్రాంతీయులని పెళ్ళి చేసుకుని ఇంకో చోట స్ఠిరపడిన వాళ్ళ సంగతి?! భార్యాభర్తలలో ఒకళ్ళు తెలంగాణా, ఇంకొకళ్ళని కోస్తా లో చదివి, వాల్ల పిల్లలు సీమ లో చదివితే ఎవరిని వాళ్ళ ప్రాంతానికి పంపించేస్తె సరి.. సమ న్యాయం ఇచినట్టుంటుంది.. పదండి అలాంటి కుటుంబాలేమైనా ఉన్నాయేమో వెతుకుదాం! :)

7 comments April 7, 2007

ఈ వాళ రాష్ట్రం బంద్!!

ఏమో అనుకున్నా గానీ, తమిళనాడు నాయకులకే కాదు, మన వాళ్ళకి కూడా బుర్ర లేదని అర్ధమయ్యింది ఇవ్వాళ నాకు! బంద్ పెట్టి ఏం పీకుతారో నాకు అస్సలు అర్ధం కాలేదు… పైగా దీనికి అన్ని పార్టీలూ ‘మద్దతు ‘ ప్రకటించాయట…

నాకు తెలిసి ఇది ఒక chain reaction. ఏదో ఒక పార్టీ మొదలుపెడుతుంది ఓట్లను ఆకర్షించటానికి. ఎక్కడ ఆ సామాజిక వర్గం వాళ్ళు తమకి దూరం అవుతారో అని భయంతొ మిగిలిన పార్తీల వాళ్ళు follow అవుతారు. ఈ బంద్ విషయంలో మొదలెట్టింది తెదేపా. తర్వాత గొంతు కలిపింది తెరాస, ఇంక మిగిలిన పార్తీలూ… కానీ ఒక్కడు కూదా బంద్ రోజు సామన్యుల జీవితం ఎంత ఇబ్బందుల పాలవుతుందో అలోచించడు…ఇవ్వాళ బంద్ పెదితే రేపు ఓబీసీ కోటా అమలు చెసేస్తారా? అది నాకు తెలియదు… కానీ ఇవ్వాళ అందాల్సిన వైద్యం అందకపొతే, శ్వాస ఆగిపోయె అభాగ్యులలో ఓబీసీలెంతమందో మన నాయకులకే తెలియాలి…

Hats off to AP politics!

Add comment April 3, 2007


Categories

Blogroll

Friends

General

Feeds

 

April 2007
M T W T F S S
« Mar   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Recent Posts

Firefox 3