Archive for October 3rd, 2007
పోకిరి చిరుత!!
అసలు మన తెలుగు జనాలకి చాలా ఓపిక అని (నన్ను కూడా కలుపుకునే లెండి) ఇప్పుడే చిరుత సిన్మాని “నలుపు” లో రెండొందలు వదిలించుకుని చూసి వచ్చాక అనిపించింది.. ఇది ఒక్కటే నేను చదివిన రివ్యూ లలో నిష్పక్షపాతం గా ఉన్నది.. రాం చరణ్ డాన్సులు, రాం చరణ్ ఫైట్లు ఫర్వాలేదనిపించాయి.. మొదటి సినిమా కాబట్టి ఎక్కువ ఆశించక్కర్లేదు.. కానీ సిన్మా కి కావలసింది “స్టార్” లు మాత్రం కాదు కదా.. “బేసిక్స్”, అంటే కథ, కథనం బాగుండాలి.. అది ఏ మాత్రం కనిపించలేదు నాకు ఇందులో… అసలు “పోకిరి” తీసింది ఈ డైరెక్టరేనా అనిపించింది…. అసలు ఈ రెండు సిన్మాలను పోల్చగలమా??
4 comments October 3, 2007


