బియ్యం కిలో రూ. 20 కా? ఎక్కడండీ బాబూ?!

January 25, 2009

ఓ పక్క మన మంత్రి గారు తనిఖీలు చేస్తూ ‘సూపర్ ఫైన్’ రకం బియ్యం కేవలం 20 రూపాయలకే అమ్మేలా చూస్తున్నామంటారు.. ఇంకో పక్క ముఖ్య మంత్రి గారు చంద్ర బాబు కొట్లలో తప్ప అన్ని చోట్లా 20 కే అమ్ముతున్నారంటూ తనదైన శైలి లో వ్యంగ్యం గా  జవాబిస్తారు…

అంత నమ్మకంగా చెప్తుంటే నిజమనే అనుకుందాం…  హైదరాబాదులో సాధారణ కిరాణా షాపులో అడిగా..  రూ. 27 అన్నిటికంటే తక్కువ రకం.. రూ. 30 ది ఒక మాదిరిగా ఉంది.. నేను చంద్రబాబు కొట్లలో కొననే కొనను.. అడిగింది మామూలు షాపు.. పోనీ హైదరాబాదు కదా ఎక్కువే ఉంటుంది, మిగిలిన చోట్ల తక్కువే ఉంటుంది అనుకుని, సొంతూరు అమలాపురం లో అడిగా.. ఎక్కడా 26 కి తక్కువే చెప్పలేదు ఎవరూ.. నేను అక్కడ ఉన్న అన్ని బియ్యం రకాల రేట్ల గురించీ అడిగాను మరి…

అసలు ఈ ‘సూపర్ ఫైన్’  బియ్యం అంటే ఏంటి? బయట మామూలుగా మనం కొనే కిరాణా కొట్లలో (పెద్ద షాపులని మర్చిపొండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు) ఈ రకం అమ్మరా? అంటే సాధారణ ప్రజలు తినేది ఈ రకం కాదా? అప్పుడు దాన్ని తక్కువకి అమ్మడం వల్ల జనాలకి ఉపయోగం ఏంటి? మరి అలా కాకపోతే సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే అబద్ధం చెప్తున్నట్టా? లేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుందా?  అబ్బే… నాకైతే ఏం అర్ధం కావట్లేదు…!!

Entry Filed under: తెలుగు, రాజకీయం. .

4 Comments Add your own

  • 1. శేషశాయి ఒంగోలు,భాగ్యనగరం  |  January 26, 2009 at 9:35 am

    You chest me. I cheat you. We both would cheat and loot all. Thats the policy.
    దోచుకుందాం రండి.

  • 2. చైతన్య  |  January 26, 2009 at 11:42 am

    ఇక్కడ ప్రసంగించదలచుకున్నవా? నీది ఏ పార్టీ? తెల్లకార్డ్ పై బియ్యం, పప్పులు ,నూనె, సబ్బులు ఇస్తున్నాం . ఏం ఇవ్వడం తప్పా?

  • 3. telugabbai  |  January 26, 2009 at 4:27 pm

    :)

  • 4. కోలాకలం  |  February 4, 2009 at 3:44 pm

    ప్రజలను వెర్రి వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. లేకుంటే ఆ ప్రకటనలు చేయడం ఎందుకు . నిన్న తప్పని సరి అయ్యి షాప్ కెలితే కిలో బియ్యం 33 రూపాయలు చెప్పారు. నేను అడిగాను ” ముఖ్యమంత్రి గారు కిలో 20 రూపాయలకు మించి అమ్మద్దంటున్నారు కదా అని” మాకు మిల్లర్లు ఆ రేటుకు ఇవ్వడం లేదు అని చెప్పారు. మరి సమస్య ఎక్కడ ఉంది. ఏ షాప్ లో నైనా 20 రూపాయలుకు కిలో బియ్యం ఇస్తున్నారా? మాటలు చెప్పడం కాదు. మాటను నిలుపుకోవడానికి ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే తప్ప అది సాద్యం కాదు. కనీసం మన ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలైనా ఇవ్వకుండా ఉండాల్సింది

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Categories

Blogroll

Friends

General

Feeds

 

January 2009
M T W T F S S
« Nov   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Recent Posts

Firefox 3