Archive for February 14, 2009
ఓటరు గా నమోదు చేసుకోండి.. జనవరి 15, 21, 22 తేదీ లలో..
మీరు గానీ, మీ ఇంట్లో వాళ్ళు గానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ, ఎవరైనా ఇంకా ఓటరు గా నమోదు చేసుకోలేదా? జనవరి 14, 15, 21, 22 తేదీలలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూలుకి గానీ, మున్సిపల్ కార్యాలయానికి గానీ వెళ్ళండి. ఈ తేదీలలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు, లేదా ఉన్న జాబితా లో మీ వివరాలూ మార్చుకోవచ్చు…. శనివారం, ఆదివారం.. శెలవు రోజులే కాబట్టి వీలు చూసుకుని ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సాయంత్రం 5 గంటల లోపు…
ఇక నేను ఈ మధ్యే శేరిలింగంపల్లి శాసన సభ ఓటరుని అయ్యాను…
కొండాపూర్ లో నమోదు చేయించుకున్నాను.. ఎవరైనా అదే ప్రాంతం లో ఉంటుంటే, దగ్గరలో ఉన్న కొత్తగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కి వెళ్ళి నమోదు చేయించుకోవచ్చు… కొండాపూర్ X రోడ్స్ దగ్గరున్న పోలిస్ బెటాలియన్ దగ్గర అడగండి.. అక్కడి నుంచి 2 నిమిషాల దూరం…


