“అటునిటు జోడించు” — చక్కటి తెలుగు సరదా ఆట ఆన్ లైన్ లో!

June 1, 2009

వ్వాళ ఫేసు బుక్ లో తెలుగు లో ఆడుకునే పదాల ఆట కోసం ఒక అప్లికేషను ని విడుదల చేసారు.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు వేరొక కంపెనీ తో ఒప్పందం తో దీనిని విడుదల చేసారట..

ఇంతకూ ముందు ఎక్కడా తెలుగులో ఇలాంటి అప్లికేషను చూడలేదు, అదీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో.. చాలా ఆనందమేసింది.. దీన్ని ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఆడితే ఇంకా మజా వస్తుంది.. తెలుగు పదాలు నేర్చుకోవాలనుకునే వారికీ, నేర్చుకుంటున్న చిన్న పిల్లలకి చాల అద్భుతంగా ఉపయోగపడుతుంది.. మీకు ఫేసు బుక్ లో ఎకౌంటు ఇప్పటికే ఉంటే, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషను ని:
http://apps.facebook.com/atunitu_jodinchu/
ఇంకా హిందీ, మరాఠీ, తమిళ్ లో కూడా విడుదల చేసారు:
http://apps.facebook.com/ulatpalatke_hindi/
http://apps.facebook.com/ulatoonpalatoonjodaa/
http://apps.facebook.com/taavi_taavi/

ఐతే ఇది ఇంకా బీటా వెర్షన్ కాబట్టి చిన్న చిన్న బగ్గులు కనబడుతుంటాయ్..అలాగే ఇవ్వాళే విడుదలయ్యింది కాబట్టి నేను కూడా ఇంకా పూర్తిగా  ఎక్స్ ప్లోర్ చెయ్యలేదు…
మన బ్లాగర్ల లోని  తెలుగు భాషాభిమానులకి ఈ విషయం తప్పకుండా తెలియాలని ఇక్కడ రాస్తున్నా… :)

Entry Filed under: తెలుగు. .

2 Comments Add your own

  • 1. రామ  |  June 2, 2009 at 8:11 am

    చాలా సంతోషం తెలియజేసినందుకు. పిల్లలకే కాక, పెద్దలకి కూడా భాషా పరిజ్ఞానాన్ని పదును పెట్టుకుంటూ ఉండడానికి ఇటువంటివి ఉపకరిస్తాయి.

  • 2. హరీశ్  |  June 3, 2009 at 11:43 am

    ధన్యవాదము బ్రదర్! మీ బ్లాగ్ లో మా అప్లికేషనుపై కొన్ని చక్కటి మాటలు రాసినందుకు చాలా సంతోషం. మీరన్నట్టు ఇది బీటా వెర్షన్. హోస్టింగ్ సమస్యలు కూడా అనుభవిస్తున్నాము. వేరే మంచి హోస్టింగ్ తీసుకోబోతున్నాము.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Categories

Blogroll

Friends

General

Feeds

 

June 2009
M T W T F S S
« Feb   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Recent Posts

Firefox 3