“మా తెలుగు తల్లికి” పాడనే వద్దా?

October 31, 2009

ట్టకేలకి మన విద్యా శాఖా మంత్రి గారి నుంచి ఒక మంచి ప్రకటన వచ్చింది.. అన్ని పాఠశాల లలో ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని పాడాలి అని ఒక నిబంధన పెడదాం అని.. రోజు మొత్తం లో కనీసం ఒక సారైనా తెలుగు వాడతారులే మంచి విషయం అని సంతోషించా.. వెంటనే తెరాస వాళ్ళ ప్రకటన (తెలంగాణా లో ఉన్న పాఠశాల లలో పాడడానికి వీల్లేదని, బహిష్కరిస్తున్నామని….) అసలు ఈ పాట లో అంతటి తప్పు ఏం ఉందా అనిపించింది.. ఎప్పుడో చిన్నప్పుడు గుంపుల్లో కలిసి పాడిన పాట, అస్సలు గుర్తు లేదు.. ఇంత వ్యతిరేకత ఉంది అంటే, తెలంగాణా సంస్కృతిని అవమానించేలాగా ఉండి ఉండాలి, లేకపోతె ఆ సంస్కృతిని గురించి సరైన ప్రస్తావన లేకపోయి ఉండాలి.. సరే చూద్దాం అని వికీపీడియా లో పాట మొత్తం చదివా… ఒక్క సారి మళ్ళీ చూద్దాం, ప్రాంతాల వారీగా ప్రాధాన్యత ని దృష్టి లో పెట్టుకుని..!
౧.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
(ప్రమాదం లేదు.. ప్రాంతాల ప్రస్తావనే లేదు, అదృష్టం బాగుండి కేవలం పొగడ్తలతో ముగించారు…)
౨.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
(ఇందులో గోదావరి, కృష్ణ నదులు గురించి.. రెండూ కలిపి మూడు ప్రాంతాల
నుంచీ ప్రవహిస్తాయి.. నిజానికి వీటిమీద తెలుగు వారికి పేటెంట్ ఏమీ లేదు,
అవి మరాఠీ లు, కన్నడిగుల సొత్తు కూడా.. అది వేరే విషయం పోనీండి..)
౩.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
(అమరావతి గుంటూరు జిల్లా, కోస్తాంధ్ర..సరే.
త్యాగయ్య 1767 లో తమిళ నాడులో జన్మించిన తెలుగు వాడు.. తెలుగు సంగీతానికి ఎనలేని సేవ చేసిన వాడు..ఒక ప్రాంతానికి చెందుతాడు అని చెప్పలేం.
తిక్కన సోమయాజి నెల్లూరు రాజు మనుమ సిద్ధి దగ్గర మంత్రి.. అయితే, అప్పట్లో నెల్లూరు కాకతీయుల ఆధీనం లో ఉండేది. వారి రాజధాని ఓరుగల్లు (వరంగల్).. మనుమ సిద్ధి రాజ్యం కోల్పోయినప్పుడు సహాయం కోసం ఆయన ఓరుగల్లు వెళితే, అప్పటి రాజు గణపతి దేవుడు ఆయనని ఘనంగా సత్కరించి మనుమ సిద్ధి రాజ్యాన్ని తిరిగి అతడికి అప్పగిస్తాడు.. అందువల్ల తిక్కన కూడాఒక ప్రాంతానికే చెందినా వాడు అని చెప్పలేము.. తెలంగాణా, దక్షిణ కోస్తా రెంటికీ.. )
౪.
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ……
(రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో పరిపాలించిన ధీర మహిళ.. మేము చదువుకునేటప్పుడు 9 వ తరగతి ఉపవాచకం లో రుద్రమదేవి గురించే ఉండేది.. అద్భుతం గా వర్ణించారు.. ప్రాంతం విషయానికి వస్తే తెలంగాణా, కానీ అన్ని తెలుగు ప్రాంతాలనూ పరిపాలించిన రాణి.. సరే, తెలంగాణా అనుకుందాం.
మల్లమ్మ గురించి నాకు ఎక్కడా దొరకలేదు.. ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు.
కృష్ణరాయలు, తిమ్మరుసు తెలిసున్నవారే కదా… విజయనగర సామ్రాజ్యానికి మహారాజు, “దేశ భాషలందు తెలుగు లెస్స” అని నినదించి తెలుగు కి స్వర్ణ యుగాన్ని తెచ్చి పెట్టిన వాడు రాయలు.. ఆయన మహామంత్రి తిమ్మరుసు..ప్రాంతానికి వస్తే, సీమ మొత్తం గా, కోస్తాంధ్ర, తెలంగాణా లలో సగం కంటే ఎక్కువ ఈ రాజ్యం లో ఉండేవి…పోనీ వీళ్ళిద్దరూ సీమ వాళ్ళే అనుకుందాం..!)

మొత్తం గా చూస్తే (మల్లమ్మ తప్పించి),
తెలంగాణా – 2 (రుద్రమ దేవి, తిక్కన)
కోస్తాంధ్ర – 2 (అమరావతి, తిక్కన)
రాయలసీమ – 2 (రాయలు, తిమ్మరుసు)

సరే తిక్కన తెలంగాణా వాడు కాదు అనుకుందాం వాదన కోసం, అయినా సరే రుద్రమ్మ ఉంది గా! ఇప్పుడు నాకు అర్ధం కానిది తెరాస వాళ్ళ గోల ఏంటి అని.. రాష్ట్రానికి, ఒక మంచి తెలుగు పాటకీ లంకె ఎందుకు అని.. ఇందులో కించపరచడం ఎలాగా లేదు.. పోనీ కొమరం భీం లాంటి వీరుల గురించి లేదు అంటారా?! అలా అయితే, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా ల పరిస్థితి ఏంటి? నాకు నన్నయ, రాజ రాజ నరేంద్రుడు, అల్లూరి సీతారామ రాజు, వంశధార, నాగావళి ఇంకా చాలా కావాలి పాట లో..
కనీసం ఇలాగైనా కాస్త తెలుగు పలుకుతారు పిల్లలు అనుకుంటే, ఈ పుడకలు ఏంటి మధ్యలో! వీళ్ళ లాంటి obviously blatant, stupid fellows నోరు ఎలా మూయించాలో నాకు అర్ధం కాదు. జరుగుతున్న ఈ ఒక్క మంచి పని కూడా వీళ్ళ వల్ల జరక్క పొతే, అంత కంటే దారుణం ఇంకొకటి ఉండదు.. ఇప్పటికే కొంత మంది సన్నాయి నొక్కులు మొదలెట్టారు… “తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా స్కూళ్ళ లో” అంటూ… ఏం, వందేమాతరం అర్ధం తెలిసే పాడామా చిన్నప్పటి నుంచి?? రాష్ట్రం లో ఉన్నందుకు తెలుగు కి ఓ 2 నిమిషాలు కేటాయిస్తే కొంపలేం మునిగిపోవు….

Entry Filed under: తెలుగు. .

69 Comments

  • 1. అబ్రకదబ్ర  |  October 31, 2009 at 2:34 am

    మూర్ఖులతో వాదులాట .. వృధా ప్రయాస. తెలంగాణ వాళ్లు తెరాసకి ఎప్పుడో తద్దినం పెట్టేశారు. ఏదో ఒకదాన్ని పట్టుకుని మేమింకా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నాలివన్నీ .. దింపుడు కళ్లెం ఆశలు. ఎగరనీయండి ఎందాకా ఎగురుతారో.

    మీ టపా మాత్రం బాగుంది.

  • 2. సుధాకర్  |  October 31, 2009 at 3:49 am

    చాలా బాగుందండీ మీ టపా. మంచి పరిశీలన.
    నేను అనుకుంటూనే ఉన్నానండీ వీళ్లు ఈ తె.రా.స వాళ్లు ఎదో పెంట పెడతారని పెట్టేసారు.

  • 3. krishnaveni  |  October 31, 2009 at 3:52 am

    మూర్ఖుల మనసు రంజింప పూనుకొన్న మీ ఓపికకు నాల్గు వీర తాళ్లు వేసుకోండి. మీరు ఎవరినయితే కాస్త అలోచింపచేద్దాం అని ఈ టపా వ్రాసారో, వాళ్ల బుఱ్ఱల లో, మట్టి తప్ప గుజ్జు పెద్దగా ఉందని అనుకొంటున్నారా?

  • 4. వేములవాడ రాజన్న  |  October 31, 2009 at 5:45 am

    మీ టపా నూ , పై మూడు కామెంట్లనూ చదివినప్పుడు నాకు కలిగిన తక్షణ అభిప్రాయం …
    “ఈ ఆంధ్రా వాళ్లకి తెలంగాణా వాళ్ళ మీద వున్న చులకన భావం చచ్చినా పోదని!”.

    >>>obviously blatant, stupid fellows.
    >>>మూర్ఖులతో వాదులాట
    >>>ఎదో పెంట
    >>>మూర్ఖుల…
    >>>వాళ్ల బుఱ్ఱల లో, మట్టి తప్ప గుజ్జు పెద్దగా ఉందని అనుకొంటున్నారా? <<<

    (మీ దృష్టిలో మేం హౌలా గాన్లం, దమాఖ్ లేనోల్లం, మూర్ఖులం … మీరేమో సంస్కార వంతులు, మేధావులు, చక్కని తెలుగు భాష మాట్లాడేవారు. మరి 1956 కు ముందులా ఎవరి మానాన వారు విడిగా వుంటే ఈ పంచాయతే వుండదు కదా. మీరు ఈ మూర్ఖుల తెలంగాణాను ఇంకా ఎందుకు పట్టుకుని వేళ్ళాడడం ? మా మానాన మమ్మల్ని వదిలేయొచ్చు కదా ? )

    మీరు తెరాసా పేరుతొ అంటున్న మాటలు మొత్తం తెలంగాణా ప్రజల మనసులను గాయ పరుస్తున్నాయి. (ఆంద్ర రాజకీయ నేతలను, కాంట్రాక్టర్లను, దోపిడీ దార్లను అంటున్న మాటలు మిమ్మల్ని గాయపరుస్తున్నట్టు గానే ) మేం తెలంగాణా కోసం తెరాసా నాయకత్వంలో పోరాడాలా మరో పార్టీ నాయకత్వం లోనా కే సి ఆర్ సమర్దుడా అసమర్దుడా దొంగా అనేది మేం తేల్చుకుంటాం అది మా అంతర్గత వ్యవహారం. అదట్లా పెట్టండి.

    తెలుగు తల్లి భావన తెలుగు వాళ్ళనందరినీ ఒక్క తాటికిన్డకు తెచ్చేందుకు …
    మదరాసీలుగా తమ ఉనికిని కోల్పోతున్న తెలుగు వాళ్ళని తట్టి లేపెందుకు, సమైక్య పరిచేందుకు సృష్టించినది.
    ఆ క్రమం లోనే "మా తెలుగు తల్లి" పాట ఆవిర్భవించింది.
    ఎన్టీరామారావు ధిల్లీ పెత్తనం కింద నలిగి పోతున్న తెలుగు ఆత్మగౌరవాన్ని పునరుద్దరింప చేసేందుకు మరో సారి ఆ పాటను జమ్మి చెట్టు మీద నుంచి కిందకు దింపి వాడారు.

    ఇప్పుడు ఆ దగుల్భాజీ సమైక్యతను, భాష పేరిట జరిగిన వంచనను, మోసాన్ని తెలంగాణా ప్రజలు తీవ్రంగా ఏవ గించు కుంటున్నారు . ఆ క్రమంలో … ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సాగుతున్న ప్రస్తుత దశలో … తెలంగాణా ప్రజలు మా తెలుగు తల్లి పాటను మీ మాదిరిగా పరవశించి పోతూ ఎట్లా పాడగలరు మీరే చెప్పండి.
    పాడినా అర్ధం వుంటుందా.??
    ఆత్మ వంచన కాదా??
    కాబట్టి ఇప్పుడు ఆ పాటని ప్రత్యెక తెలంగాణా కోరుకొని వాళ్లైనా పాడాలి లేదా మీరు అభివర్నించినట్టు స్టుపిడ్, మూర్ఖ , దమాఖ్ లేని తెలంగాణా పెంట మనుషులైనా పాడాలి

    నా మాట్టుకు నాకు మొదట్లో ఆ పాట మీద పెద్దగా వ్యతిరేకత లేదు. టంగుటూరి సూర్యకుమారి గాత్రాన్ని నేను కూడా నిన్నటి వరకూ పరవశంగా విన్న వాడినే! పాడుకున్న వాడినే!! ఇప్పుడు మాత్రం పాడలేను…. పరవశించలేను. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత మీతో కలిసి పాడమంటే మాత్రం తప్పక పాడతా !
    అట్లాగే మీరు కూడా అప్పటివరకు, లేదా ఇప్పటికైనా మచ్చుకు కొన్ని తెలంగాణా పాటలను, బతుకమ్మ పాటలను నేర్చుకోండి. మీ ఆడపడచులచేత బతుకమ్మ పాటలు పాడించండి. బతుకమ్మ పండుగ మీ ప్రాంతం లో కూడా జరుపుకోండి.

    ఇంకొక్క మాట.
    వందే మాతరం అన్న పాటలో తప్పేం వుందండి?.
    అందులో బ్రిటీష్ వాణ్ని అవహేళన చేసే మాటలు ఏమున్నాయి ?
    అయినా బ్రిటీష్ వాడు ఆ మాట వినపడితే చాలు ఎందుకు శివాలెత్తి పోయాడు. అది భారతీయులలో ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపోదిస్తుందనే కదా.
    అట్లాగే ఇప్పుడు తెలుగు తల్లి పాట పేరిట దొడ్డి దారిన అన్యాయానికి పర్యాయపదంగా మారిన సమైక్యతను చొప్పించా లని అనుకుంటున్నారు. అందుకే మేం ఆ పాటను అంతే గట్టిగా వ్యతిరేకిస్తున్నాం.
    మా ఆవేదను అర్థం చేసుకుంటారో …. మీ సహజ ధోరణితో అవహేళన చేస్తారో మీ ఇష్టం.

    ఆ పాట తోనే తెలుగు ఉద్ధరించ బడుతుంది, ఆ పాట తోనే తెలుగు అమలు ఐ పోయినట్టే అనడం అంత ఆత్మ వంచన, పర వంచన మరొకటి లేదు.
    జై తెలంగాణా !

  • 5. ramani  |  October 31, 2009 at 6:30 am

    చాలా బాగా రాసారండి. మీరు విశ్లేషించిన తీరు బాగుంది. నాకర్థం కానిది ఒక్కటే ఇక్కడ, తెలంగాణ వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగే కదా ఇక ఈ పాట ఒప్పుకోకపోవడమెందుకు? వాళ్ళ తెలుగు యాస కొంచం వేరు అంతే. అర్థమొకటే కదా తెలుగు తల్లి వాళ్ళ యాసలోకూడా తెలుగుతల్లే కదా. బాష ఒక్కటే మరి ఇంకా ఈ లిటిగేషన్ ఎంటో.

  • 6. శ్రీధర్ రాజు - చికాగొ  |  October 31, 2009 at 7:55 am

    ఏంజెప్పినౌరా రాజన్నా – నా నోట్లెకెల్లి వచ్చినట్టే ఉంది. నువ్వు రాసింది చదువుతుంటే ధిమాఖ్-లెంత ఖుషైందనుకున్నవ్… నిన్ను బుజాలమీదెక్కిచ్చుకొని తెలంగాణ ఉరంతా తిప్పబుద్దైతంది. దండాలన్నో ఎములాడ రాజన్న దండాలు,

    ఇంకస్సలు సంగతికొస్తే – తమిళసముద్రంల కొట్కపోతున్న తెలుగు భాషను కాపడ్కోనికి “మా తెనుగు తల్లికి మల్లె..” అని పాటకంట్టిండ్రు. అంతేగని ఆ పాట తెల్గొల్లందర్ని ఒక్కతాన కల్సిమెల్సి ఉంచడానికైతే పనికిరాలె. నువ్వుచెప్పినట్టు ఆ పాత పాట పాడనికి మనాయించుడిప్పుడొక యుద్దం జెసెటోంచెతిల బాడ్సెలాగైందంతే. అంతేగని ఆ పాటల తెలంగాణ గురించి అడ్డాదిడ్డంగ రాసుందని కాదు. ఆంధ్రొల్లమీద, వేరోల్లమీద విషంగక్కనికైతే అసలేగాదు.

    పసికరికలొచ్చినోల్లకు దునియాంత పచ్చగ్గనిపించినట్టు – తెలంగాణ్ల పుట్టిపెరగనోల్లందర్కి ఇదొక దారుణం లాగనేకొడ్తది. ఇక్కడి కష్టాలనర్థం జెసుకొనికి ఇట్లాంటోల్లందరు ఇక్కడనే పెట్టి పుట్టాలె… గప్పుడు సంజైతది.

    పైన వ్రాసిన భాషలోని మాధుర్యం రుచించాలంటే – తెలంగాణ జానపద సాహిత్యంలో డాక్టరేట్ తీసుకోవాలి.

    If I write even better and pure Telangana language; it is quite impossible to understanding for any non-Telangana but Telugu speaking people. What I just wrote above is very light – I am sure, this is enough to give you an idea. Personally, I don’t like KCR either – but he gets enough credit for creating the momentum and enthusiasm.

    మరొక్కసారి – ఎములాడ రాజన్న దండాలు. నువు మంచిగుండాలె, నూరేల్లు బత్కాలె. ఇక్కడి కష్టాల్నర్థంజేసుకొనెటోల్లందర్కి దండాలతో…

    శ్రీధర్ రాజు – చికాగొ

  • 7. సుజాత  |  October 31, 2009 at 9:09 am

    చాలా మంచి పరిశీలన!మీ ఆవేదన అంతా టపాలో స్ఫురిస్తోంది. తెలుగు తల్లి ఒక భాషకు మాత్రమే తల్లి అనీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అని గ్రహించని వాళ్ళకు, అర్థమైనా గ్రహించడానికి మొరాయించే వాళ్ళకు ఎంత చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే!

    మొండివాడు రాజుకంటే బలవంతుడని సామెత! మెదడు తలుపులు మూసుకుని కూర్చున్న వాళ్ళకు అర్థమయ్యేలా ఎలా వివరించగలం?

    ఈ పాట పాడమని మొరాయించే వారు తెలంగాణాకు సంబంధించి వేరే ఏదైనా భాషను సృష్టించి ఆ భాష మాట్లాడితే బాగుంటుందేమో మరి, “తెలుగు” తల్లి పేరెత్తే పని లేకుండా!

    మీ టపా మాత్రం చాలా బావుంది.

  • 8. naalonenu  |  October 31, 2009 at 9:17 am

    భాగ్యనగరం లో మునిసిపల్ ఎన్నికలు ఇప్పుడే లేకపోతే ఈ టాపిక్ వచ్చేదంటారా?
    మౌళిక వసతులు, కిలో 50 రూపాలవబోయే బియ్యం ధర, ఇట్లాంటివి సామాన్యుడికి గుర్తు రాకుండా వుండాలంటే చాలా బాగా పనికొస్తాయి ఈ విషయాలు. వలలోకి లాగారు, మనం పడుతున్నాం.
    అసలు సమస్యలను గూర్చి నిలదీయకూడదనే అందరూ కలిసి ఆడుతున్న నాటకం.
    కానివ్వండి మహాప్రభో! కానివ్వండి.

  • 9. Phanikumar  |  October 31, 2009 at 10:58 am

    @అబ్రకదబ్ర, @సుధాకర్, నెనర్లు.. :)
    @ krishnaveni ఏదైనా పోయేది తెలుగు వాడుకే కదండీ…
    @ వేములవాడ రాజన్న
    నా టపాకి కామెంటినందుకు ముందుగా నెనర్లు…
    ముందుగా ఒక్క విషయం..దేశం లో ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండోది అయిన తెలుగు ప్రజల కోసం ఒకటేమిటి.. రెండు రాష్ట్రాలు భేషుగ్గా ఉండొచ్చు.. నా ఉద్దేశం రాష్ట్రం గురించో తెలంగాణా గురించో కాదు.. కేవలం తెలుగు ని నిలబెట్టుకోవడానికి జరిగిన చిన్న ప్రయత్నానికి మద్దతు తెలపడమే…
    “మీరు తెరాసా పేరుతొ అంటున్న మాటలు మొత్తం తెలంగాణా ప్రజల మనసులను గాయ పరుస్తున్నాయి.”
    ఇదెలాగో నాకు అర్ధం కాలేదు… :) మొదటి వాక్యం లోనే కేసిఆర్, ఆయన గారి అనుయాయూలని మొదలుపెడితే ప్రజలందరూ ఎందుకొచ్చారు.. సర్లెండి…

    అంటే రాష్ట్రం కావాలి అంటే ‘తెలుగు వాళ్ళు’ అనే సమైక్య భావన పోవాలి.. ఆ క్రమం లో మధ్యలో ఈ పాట ఒకటి అడ్డుగా వచ్చింది.. అందువల్ల ఈ తెలుగు పాటని పాడడానికి వీల్లేదు.. ఈ లోపు తెలుగు కి పొయ్యేకాలం వచ్చినా సరే.. రేప్పొద్దున్న నిజంగా తెలంగాణా వచ్చేటప్పటికి తెలుగు మాట్లాడే వాళ్ళు మైనారిటీ అయినా సరే..
    అసలు తెలంగాణా పాటల గురించి ఇప్పుడు ఎందుకు సార్.. అంటే ఈ పాట కేవలం ఆంధ్రా/సీమ వాళ్ళ గురించి ఉందా.. ఇదే విషయాన్ని ఖండించడానికి ఈ టపా రాసాను అసలు.. గొబ్బిళ్ళు తెలంగాణాలో పెట్టినప్పుడు కోనసీమలో బతుకమ్మ దానంతట అదే వస్తుంది, మనం ఏమీ చెయ్యక్కర్లేదు… :)

    ఇక నేను వందేమాతరం గురించి ప్రస్తావించినది తెలుగు రాని వాళ్ళు తెలుగు తల్లి పాట ని పాడితే తప్పేమీ లేదు అని చెప్పడానికి…
    ఈ పాట పాడటం మానేస్తే తెలంగాణా వస్తుంది, ఈ పాటని చంపేస్తే తెలంగాణా సంస్కృతి బ్రతికేస్తుంది అనుకుంటే, అంత కంటే ఆత్మవంచన మరొకటి లేదు.. ఈ లోపు తెలుగే మర్చిపోతారు పిల్లలు అని చెప్పడం నా ఉద్దేశం.. :)

    @ శ్రీధర్ రాజు – చికాగొ
    మీకు కూడా నెనర్లు ముందుగా..
    ఇక్కడ ఇంకొక అనుకోలు (assumption) గురించి రాయాలి.. తెలంగాణా తెలుగు మిగిలిన వాళ్ళకి అర్ధం కాదు అని.. మీరు రాసిన తెలుగు అర్ధం కాదు అని ఎందుకు అనుకుంటున్నారు? కాస్త తెలుగు సరిగ్గా వచ్చిన వాళ్ళకి దీన్ని అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదే! నా మటుకు నేను అలా మాట్లాడలేకపోవచ్చేమో గానీ, అర్ధంచేసుకోవడానికి శ్రీకాకుళం భాష, అనంతపురం భాష, ఎలాగో ఇది కూడా అంతే..! సరే రెండు యాసలు తెలుగు సాహిత్యం లో ఉండడం భాష గొప్పదనమే కదా.. :) దీనికి వేరే తెలుగు వాళ్ళని అనుమానించడం ఎందుకు…
    ఇక కేసిఆర్ లాంటి వాళ్ళ వల్లే ప్రాంతాల మధ్య అనవసరమైన అగాధాలు సృష్టించబడుతున్నాయి.. ముందు వాళ్ళు జనాలలో చులకన అవుతారు.. తర్వాత వాళ్ళ వల్ల greater cause కూడా పలుచన అయిపోతుంది.. నా ఉద్దేశం లో విబెధాలని కారణంగా చూపించినంత కాలం తెలంగాణా రావడం కష్టమే…

  • 10. Saikiran  |  October 31, 2009 at 11:06 am

    ఇక్కడి ఏ కామెంటులోనూ తెలంగాణా ప్రజలని ఎవరూ అవమానించినట్లు నాకైతే అనిపించట్లేదు. రాజన్నగారు అనవసరంగా ఆవేశపడినట్లున్నారు.

    రాజన్న గారు, తెలంగాణాపై తె.రా.స.కు నిబద్ధత లేదు. తెలంగాణా సాధనకు ప్రస్తుతం కావలసింది కె.సి.ఆర్.లు కాదు, పొట్టి శ్రీరాములు (కోస్తా వ్యక్తి) లాంటి త్యాగధనులు. నవంబరులో నిరాహారదీక్ష చేస్తానంటున్నాడుగా కె.సి.ఆర్. చూద్దాం. మునుపటిలా అరపూట ఉపవాసం ఉంటాడో, తెలంగాణా కోసం త్యాగం చేయటానికి సిద్ధమౌతాడో.

  • 11. గిరి  |  October 31, 2009 at 3:23 pm

    బహు చక్కని విశ్లేషణ ఫణీ.
    ఐక్యంగా పడుండండిరా బాబూ అంటే కాదుకాదంటూ పేట్రేగే వేర్పాటువాదుల్ని తొక్కిపెట్టేవాళ్ళే లేకపోతే ప్రబలే పిడివాదాలు ఎలాంటివో రాజన్న వ్యాఖ్యవల్ల తెలిసింది.

  • 12. కె.మహేష్ కుమార్  |  October 31, 2009 at 4:23 pm

    అసలీ చర్చే అనవసరం. తెలుగు ఒక భాష. తెలంగాణా ఒక ప్రాంతం. రెంటికీ లంకెకట్టి ఒక వాదం చేసే మూర్ఖ్హులతో ఎందుకూ…

  • 13. వేములవాడ రాజన్న  |  October 31, 2009 at 4:44 pm

    తెలుగబ్బాయి గారూ
    >>>> తెలుగు ప్రజల కోసం ఒకటేమిటి.. రెండు రాష్ట్రాలు భేషుగ్గా ఉండొచ్చు.<<<>> అని మీరు అనుకుంటున్నారు . కాదు కాదు తెలుగు తల్లి పాట పేరుతొ పన్నుతున్న మరో సరికొత్త కుట్ర అని మేం అంటున్నాము ఇక్కడే వస్తోంది పేచి!!

    తెలుగు భాషను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో తప్పనిసరి రెండవ అధికార భాషగా చేస్తూ జీవో తీసుకు రండి. తెలంగాణా వాళ్ళు అభ్యంతరం చెప్పరు!
    ప్రభుత్వ జీవోలను, చట్టాలను అన్నింటినీ తెలుగులోకి అనువదించి, తెలుగులో పరిపాలన సాగించండి ఏ తెలంగాణా వాదీ అడ్డు పడడు.!!
    ఇట్లా పనికొచ్చే పనులు చేయకుండా పనికిమాలిన సెంటిమెంట్లతో చిచ్చు పెట్టడం దేనికండి??? మనకంటే అద్భుతంగా తమ రాష్ట్రం లో తమ భాషను అమలు పరుచుకుంటున్న తమిళ ప్రజలకు ఈ దిక్కుమాలిన … “తమిళ తల్లి” … అనే సెంటిమెంటు లేదు, తమిళ తల్లి విగ్రహాలు లేవు. . అసలు భారత దేశంలోని ఇతర ఏ రాష్ట్రం లోనూ “భాషామ తల్లుల” భావనే లేదు. ఒక్క “భారత మాత” భావన తప్ప. అది ప్రాంతం/ ప్రదేశం కు సంభందించింది. మొదట్లో మనకు కూడా ఆంధ్ర మాత అన్న భావనే వుండేది. “నమో ఆంధ్ర మాతా, మాతా నమో దివ్య తేజా.” అన్న పాట మీరు విన్నారో లేదో. వదిలేయండి.

    ఈ తెలుగు తల్లి పాటను తే రా సా ఒక్కటే కాదండి, తెలంగాణా కవులు కళాకారులు తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణా రచయితల సంఘం ప్రకటనను ఈ రోజు పేపర్లలో చూడ వచ్చు.కాబట్టే పైన మీరూ, కమెంతేతర్లూ వాడిన పదాలు బాధను కలిగిస్తున్నాయి.

    అట్లాగే చాలా దారుణంగా >>>>> ఈ పాట పాడటం మానేస్తే తెలంగాణా వస్తుంది, ఈ పాటని చంపేస్తే తెలంగాణా సంస్కృతి బ్రతికేస్తుంది అనుకుంటే, అంత కంటే ఆత్మవంచన మరొకటి లేదు.. ఈ లోపు తెలుగే మర్చిపోతారు పిల్లలు అని చెప్పడం నా ఉద్దేశం ….<<<>>తెలుగు తల్లి ఒక భాషకు మాత్రమే తల్లి <<< అని గ్రహించేంత తెలివి, భారత దేశంలో మరే ఇతర భాషకు లేని తల్లి ఒక్క తెలుగు భాషకే ఎక్కడినుంచి వచ్చిందో, ఎందుకొచ్చిందో, ఎవరి ప్రయోజనాలను కాపాడుతోందో వంటి విషయాలు ఏమీ అర్ధం చేసుకోలేనంత మూర్ఖుల్లా, చెవిటిమాలోకాల్లా కనిపిస్తున్నామా తల్లీ మేం మీకు.?!
    తెలుగు తల్లి పేరెత్తకుండా మేం వేరే ఏ భాషనైనా సృష్టించుకుని అందులో మాట్లాడుకోవాలా !
    మీ కామెంట్ ఏమీ న్యాయంగా లేదు తల్లీ !

    @ సాయి కిరణ్ గారూ
    తెలంగాణా పై తెరాసా నిబద్ధత అటుంచండి. తెలంగాణా పాట పాడిన కాంగ్రెస్స్, తెలుగుదేశం, బీజేపీ. ప్రజారాజ్యం, సీపీ ఐ వగైరా పార్టీల నిబద్ధత మాటేమిటి.? ఓట్లు పడే దాక ఓడ మల్లన్న ఓట్లు అయిపోయినంక బోడ మల్లన్న . మన రాజకీయాలు ఎంతగా బ్రష్టు పట్టిపోయయో. ఎంతగా కుళ్ళి కంపు కొడుతున్నాయో చూస్తూనే వున్నాం . నిన్న చెన్నారెడ్డి, చిన్నా రెడ్డి వగైరాలు చేసిన ద్రోహం, రేపు కేసీఆర్ చేయబోయే ద్రోహం ఏమైనా గానీ మెజారిటీ తెలంగాణా ప్రజలు ప్రత్యెక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు.. ఇది వాస్తవం. దీనిని మీరు ఆమోదిస్తే చాలు.

    చివరగా చికాగో తమ్ముడి ద్వారా
    దేశ దేశాలలో వున్న తెలంగాణా వాదులందరికీ జేజేలు తెలుపుతున్నా.!
    తెలంగాణా వాళ్ళు ఇట్లా ప్రపంచం లో ఏ దేశం లోనైనా బతక గలరు, కానీ ఆంధ్రా రాయలసీమలలో మాత్రం చచ్చినా బతకలేరు. ఇదీ మన 55 సంవత్సరాల దిక్కుమాలిన సమైక్యత !!

  • 14. వేములవాడ రాజన్న  |  October 31, 2009 at 4:56 pm

    కాపీ పేస్ట్ లో కొంత గందరగోళం చోటుచేసుకుంది. అందుకే ఆ భాగాన్ని తిరిగి ఇక్కడ పొందుపరుస్తున్నాను.
    ,,,,,,,,
    అట్లాగే చాలా దారుణంగా >>>>> ఈ పాట పాడటం మానేస్తే తెలంగాణా వస్తుంది, ఈ పాటని చంపేస్తే తెలంగాణా సంస్కృతి బ్రతికేస్తుంది అనుకుంటే, అంత కంటే ఆత్మవంచన మరొకటి లేదు.. ఈ లోపు తెలుగే మర్చిపోతారు పిల్లలు అని చెప్పడం నా ఉద్దేశం ….<<<>>తెలుగు తల్లి ఒక భాషకు మాత్రమే తల్లి <<< అని గ్రహించేంత తెలివి, భారత దేశంలో మరే ఇతర భాషకు లేని తల్లి ఒక్క తెలుగు భాషకే ఎక్కడినుంచి వచ్చిందో, ఎందుకొచ్చిందో, ఎవరి ప్రయోజనాలను కాపాడుతోందో వంటి విషయాలు ఏమీ అర్ధం చేసుకోలేనంత మూర్ఖుల్లా, చెవిటిమాలోకాల్లా కనిపిస్తున్నామా తల్లీ మేం మీకు.?!

    తెలుగు తల్లి పేరెత్తకుండా మేం వేరే ఏ భాషనైనా సృష్టించుకుని అందులో మాట్లాడుకోవాలా !
    మీ కామెంట్ ఏమీ న్యాయంగా లేదు తల్లీ !

  • 15. వేములవాడ రాజన్న  |  October 31, 2009 at 5:00 pm

    Hatosmi!

  • 16. Phanikumar  |  October 31, 2009 at 7:02 pm

    @ కె.మహేష్ కుమార్
    కానీ రాష్ట్రం పేరుతొ భాషని కించ పరచడం ఎంత వరకూ సమంజసమండీ…
    @ వేములవాడ రాజన్న
    సరే.. నాకు అర్ధమయినంత వరకూ, మీరు అనేది — ఈ పాట కేవలం “ఆంధ్ర దోపిడీ దారుల కుట్ర” వల్ల వచ్చిందే గానీ నాయకులకి చిత్త శుద్ధి ఉండి కాదు.. ఈ పాటని “తెలంగాణా కి జరిగిన విద్రోహానికి సింబాలిజం” గా గుర్తించడం వల్ల నవంబర్ ౧ ని ఏ రకంగా మీరు ఆమోదించరో, దీనిని కూడా అదే రకంగా ఆమోదించరు — అంతేనా?
    కానీ ఈ పాట తెలుగు వాళ్ళందరి గురించి కదా? దీన్ని సింబాలిజం గా ఎలా తీసుకుంటారు? ఈ పాట 1956 నవంబర్ ౧ న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన రోజు నుంచీ రాష్ట్ర గీతం గా చెలామణీ అవుతోందా..? దీన్ని ఇంకో కుట్ర కింద ఎలా అనుకుంటున్నారు? ఇది కుట్ర అయితే మీరు ఇచ్చిన మిగిలిన సలహాలు కుట్ర ఎందుకు కాకూడదు?
    అదే తీరుగా.. తెలంగాణాలో కబడ్డీ ఆడకూడదు, కృష్ణ జింక, పాల పిట్టలు కనిపిస్తే కాల్చెయ్యాలి, కూచిపూడి నాట్యాన్ని నిషేధించాలి.. ఎందుకు ఈ చిన్న తెలుగు పాట మీద పాడడం, మనల్ని మనమే అవమానించుకోవడం!!
    అందరికీ అర్దమయ్యేటట్టుగా ఒక్క సారి కూడా దీనికీ తెలంగాణా కి జరిగిన అన్యాయానికి ఉన్న లింకు గురించి ఒక్కళ్ళు అయినా చెప్పడం నేనైతే వినలేదు మరి.. తెలుగు వేరు తెలంగాణా వేరు అని కాకరకాయ కబుర్లు తప్పిస్తే..

    “తెలంగాణా వాళ్ళు ఇట్లా ప్రపంచం లో ఏ దేశం లోనైనా బతక గలరు, కానీ ఆంధ్రా రాయలసీమలలో మాత్రం చచ్చినా బతకలేరు. ఇదీ మన 55 సంవత్సరాల దిక్కుమాలిన సమైక్యత !!”
    ఇలాంటి sweeping generalizations తో, వివక్ష మీ దగ్గర పెట్టుకుని మిగిలిన వారినంటే ఏం లాభమండీ! నాకు తెల్సిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు.. అరె, నాకు తెలిసి చూసిన ప్రతీ ఆంధ్ర ఊళ్ళో ముస్లిం లు, మరాఠీలు, ఒరిస్సా వాళ్ళు ఉండగా లేనిది తెలంగాణా వాళ్ళు ఉండలేరా!!

  • 17. కె.మహేష్ కుమార్  |  October 31, 2009 at 7:45 pm

    బాబులూ తమిళ్ తాయి,కన్నడ తాయి,మళయాళ మాతలు ఉన్నారు. భాషను మాతృస్వరూపంగా చూసే సంస్కృతి by default మన దేశంలో ఉంది. లేదూగీదూ అనుకుంటే ఆంధ్రమాత,తెలంగాణా తల్లులే లేరు. కాబట్టి ఈ తెలంగాణా వాదుల extended imagination చాలా హాస్యాస్పదం.

    అయినా,మా తెలుగుతల్లి అనే గీతంలో ఉన్నది “తెలుగు భాష” తల్లేతప్ప “ఆంధ్ర”ప్రాంతానికి మాత్రం సంబంధించిన తల్లి కాదుకదా! మరి సమస్య ఎక్కడ్నుంచీ వచ్చింది?

    ఇలాంటి డొంకతిరుగుడు argument పెట్టుకోవాలంటే నిజానికి రాయలసీమవాళ్ళు hands down గెలిచేస్తారు. ఆ పాటలోవున్న చాలా నదులూ,చాలా మంది మనుషులూ (కృష్టరాయలు తప్ప…ఆయనా కన్నడిగుడు కాబట్టి మనోడు కాదనుకుంటే అదీ కాదు) ఆ ప్రాంతానికి చెందరు. ఈ ఎదవ ఆర్గ్యుమెంట్లు కట్టిపెట్టడమే బెటరు.

    ఈ పాటపాడకపొయినా వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. కానీ ఇలాంటి వివాదాలతో మాత్రం కొన్ని రాజకీయ శక్తులు బాగుపడతాయి. మలాంటోళ్ళు విలువైన చర్చలు/రచ్చలు జరుపుకొని ఆనందించొచ్చు.

  • 18. krishnaveni  |  October 31, 2009 at 8:58 pm

    నేను బుఱ్ఱ తక్కువ అన్నది, భాషను ఓ ప్రాంతానికి ముడిపెట్టి చూసే ముక్కు KCR ఆయన శరభ, శరభ అంటూ పూనకం వచ్చినప్పుడు వాగే వాగుడు అన్నింటికీ గంగెరెద్దులు లాగా తలూపే బుఱ్ఱతక్కు వాళ్లను కాని, ఓ ప్రాంతానికి చెందిన వాళ్లను మాత్రం కాదు, ఆ మాటకు వస్తే తెలివితేటలు అనేవి ప్రాంతాన్ని బట్టి ఉంటాయి అంటే అంతకంటే తెలివితక్కు అలోచన ఉండదు.
    ఇక భాషకు , ప్రాంతానికి ముడిపెట్టి, తెలుగు పాట పాడటానికి ఒప్పుకోము, నిజాం చాలా మంచి మారాజు అని పొగిడే వాళ్లు బుఱ్ఱలో గుజ్జు లేని వాళ్లు అనేదే ఇప్పటికీ నా అభిప్రాయం, వాళ్లు వేములవాడ రాజన్నలయినా, యాదగరిగుట్ట నరసిమ్హులయినా :)

  • 19. krishnaveni  |  October 31, 2009 at 9:01 pm

    @Phani,
    ఇలాంటి sweeping generalizations తో, వివక్ష మీ దగ్గర పెట్టుకుని మిగిలిన వారినంటే ఏం లాభమండీ!.
    Well Said. IMHO, It is very difficult to deal with people who always feel inferior by nature (irrespective of area where they came from)

  • 20. శ్రీధర్ రాజు – చికాగొ  |  October 31, 2009 at 10:38 pm

    తెలంగాణేతర వాసుల్లారా, వలసదారుల్లార, తెలుగు భాషాభిమానుల్లారా,

    తమ మనసుకు వచ్చినట్టెల్లా ఆక్షేపించినారు – అసలు మీ ఏవగింపు ఈ పాటను నీశేదించేవారిమీదా లేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించే వారిమీదా?

    నా దృష్టిలో, ఈ పాటనిషేదం పోరాటంలో ఒక ఆయుధం మాత్రమే – అంతేకాని దాంట్లో ఏదో తప్పు రాసుందని ఎవరన్నారు.

    గాంధి గారు ఖద్దరు ధరించి – విదేషి వస్త్రధారన బహిష్కరించలేదా? అప్పుడు తెల్లతోలు మహామహులు మీకులాగె కొంపలారిపొతున్నట్టు వస్త్రంలో ఏముందని గగ్గోలు పెట్టలేదా? ఎలిజబెత్ రాణి ఏం పీకలేకపోయింది!

    అందుకే, ఒక మనవి – మీకు దమ్ముంటే, మీకు ఈ పాట మీదున్న మమకారం నిజమైనదే అయితే – మీరుకాని, మీ తమ్ముల్లు, చెల్లెల్లు, కొడుకులు, కూతుల్లు, మనవల్లు, మనవరాల్లు కాని – తెలంగాణలో పెంచి పెద్దచేయండి. స్థానిక ప్రజలచే నడిపే బడులలో, కలశాల్లో చదివించండి. ఆప్పుడు తెలంగాణ ప్రజల కష్టసుఖాల గురించి మాట్లాడండి? ఏమో – మరో పొట్టి శ్రీరాములు లాంటి ధైర్యవంతుడు కూడా తయారవచ్చేమో!

    కేసిఆర్ లాంటివాల్లు ఉద్యమాన్ని బ్రష్తుపట్టిస్తున్నారని మీరంటే, మరి విరసం, గద్దర్, శ్రీశ్రీ, కాళోజిల మాటేమిటి. అసలు సిసలైన తెలుగు బ్రతికుంది ఒక్క తెలంగాణలోనె అన్న దాశరధి మాటేమిటి.

    మన దేశంలో హింది ప్రముఖంగా మాట్లాడే 12 రాష్ట్రాలు లేనిది – 2 లేదా 3 తెలుగు మాట్లాడే రాష్ట్రాలుంటే తప్పా. ఆ రాష్ట్రాల్లో హింది-మాత గురించి వినలేదే! అంత మాత్రాన హింది మాట్లాడడం మానేయలేదే!

    ఇక్కడి తెలంగాణ ప్రజలు వేరే దేశమడగలేదే! కాని ఆ రోజు కూడ ఇలాగే బుద్దిలేని వాదనలతో కాలం వృధా చేస్తు వదిలేస్తే చాలా తొందరలోనే వస్తుందిలెండి! ఇక ఇప్పటికి మాత్రం మరో గత్యంతరం లేక కేసిఆర్లాంటివాల్లకు మద్దత్తు ఇస్తాం – బాధని అర్థం చేసుకుంటే ఆనందిస్తాం లేదా మమ్మల్ని ఇలా వదిలేయండి.

    శ్రీధర్ రాజు – చికాగొ

  • 21. chandu  |  October 31, 2009 at 11:29 pm

    anna sridharranna jabardhasthi ga cheppinave

  • 22. chandu  |  October 31, 2009 at 11:32 pm

    vande mathram thappkunda padali anna …
    kondari ki villaku pedda theda ledu

  • 23. Phanikumar  |  October 31, 2009 at 11:40 pm

    babu chandu garu vandemataram gurinchi emundo jara choosi comment ivvundri… :)
    “…ఇక నేను వందేమాతరం గురించి ప్రస్తావించినది తెలుగు రాని వాళ్ళు తెలుగు తల్లి పాట ని పాడితే తప్పేమీ లేదు అని చెప్పడానికి…”

  • 24. యాదయ్య - రామాయంపేట  |  November 1, 2009 at 8:10 am

    యదిమర్శిన భాధలన్ని తిరిగితోడినౌ గదయ్యా శీధరయ్య – నీలాగ సక్కంగ చెప్పెటోల్లు కరువైండ్రిప్పుడు తెలంగాణ్ల.

  • 25. నాయిష్టం నాది  |  November 1, 2009 at 9:00 am

    శ్రీధర్ రాజు – చికాగొ
    ఇదెలా సాధ్యం అదే రాష్ట్రం లో ఉండే జనాలు మీ ప్రాంతాలలో బతకొద్దు మీరెలా చికాగొ లో ఉంటున్నారు స్వామి ఏమి ఈ మాయ ఇది వలస కాదా ? ఆ దేశప్రజల కడుపు మీద కొట్టడం కాదా ? ఆ దేశప్రజలు ఉద్యోగ అవకాశాలు నాశనం చేయటం కాదా ? అన్యాయం నశించాలి ఈ వలస వాదులు అందరు అమెరికా వదలి వెళ్ళాలి , అమెరికా గాలి , నేలా , సంస్కృతీ ఆ దేశ ప్రజల సొంతం . డౌన్ డౌన్ వలసవాదులు . అసలే ఆర్ధ్యకమాంద్యం తో కుంగి పోయి ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్తితులలో ఈ వలసవాదులు అమెరికా నేల మీద ఎలా ఉంటారు.

  • 26. చదువరి  |  November 1, 2009 at 10:20 am

    కుట్ర! అవును కుట్రే. కాని చేస్తోంది కోస్తా, సీమలు కావు. కుట్ర చేస్తున్నది తెలంగాణావాదులు, బాధితులు -కోస్తా సీమ వాసులు.

    అభివృద్ధిలో అసమానతలు సర్వ వ్యాప్తమని తెలిసీ మేం వెనకబడిపోయాం, మీరు అభివృద్ధి చెందారు అంటూ గోలపెడుతూంటారు. కానీ, ఒకటి చూడండి.. అభివృద్ధి గురించిన చర్చ రాగానే మహబూబ్‌నగరు పేరెత్తుతారు. ఖమ్మం, కరీంనగరు, నిజామాబాదు, రంగారెడ్డి,.. వీటి గురించి ఎవరైనా మాట్టాడతారా? లేదు! వెనకబాటుతనమనగానే పాలమూరు, నల్లగొండ ఈ రెండే గుర్తుకొస్తాయి. మిగతా ప్రాంతం సుభిక్షంగా ఉన్నదని కాదు. అభివృద్ధి చెందలేదు అని గోలచెయ్యడానికి ఆయా ప్రాంతాలు పనికిరావు. ఇక్కడ బాగా వెనకబడ్డ జిల్లాను తీసుకుని, అక్కడ బాగా అభివృద్ధి చెందిన జిల్లాతో పోలుస్తారు. ఏఁ, హైదరాబాదు జిల్లాతోనో, నిజామాబాదు జిల్లాతోనో, కరీంనగరుతోనో, వరంగల్లుతోనో – శ్రీకాకుళం జిల్లామో, ప్రకాశాన్నో, అనంతపురాన్నో పోల్చరే? ఇదీ కుట్రంటే!

    మా భాష వేరు మా భాష వేరు అంటూ ఊదరగొడుతూఈంటారు. యాస వేరైతే భాష వేరైపోద్దా అని అడిగితే అదంతే అంటూ మొండివాదన చేస్తారు. మా భాషను గేలి చేస్తున్నారు, మా సంస్కృతిని హేళన చేస్తున్నారు అని నోటితో ఓపక్క బాధపడుతూనే, మా ఊళ్ళో బుల్లెబ్బాయి అని ఎవణ్ణైనా పిలిస్తే చెప్పు తీసుక్కొడతాడు అంటూ నొసటితో విషం కక్కుతారు. ఇదీ కుట్రంటే! సినిమావాళ్ళు ఉత్తరాంధ్ర యాసలను, గోదావరి యాసను, కృష్ణా గుంటూరు యాసలను, రాయలసీమ యాసలను కూడా హాస్యానికో, విలనీకో, బడుగుజీవుల భాషగానో చూపించారనే ఇంగిత జ్ఞానం వీళ్ళకు లేకకాదు – కుట్ర అంతే!

    ఇంకా మాట్టాడితే బతుకమ్మలు ఆడండి, మా బడుల్లో చదివించండి, రాష్ట్రం మొత్తానికి తెలంగాణ అని పేరు పెడదాం, ఆంధ్రా హోటళ్ళు తీసెయ్యండి, కార్పొరేటు కాలేజీలు ఎత్తెయ్యండి అంటూ షరతులు పెడతారు. ఎక్కడ చదివించాలఏది నిర్ణయించేది ఆర్థిక స్తోమతే గానీ, ప్రాంతం కాదని వీళ్ళకు తెలీక కాదు. ఇతర ప్రాంతాలవాళ్ళ కార్పొరేటు కాలేజీలు మాదగ్గర పెట్టడానికి వీల్లేదని అతివాదులు వెళ్ళగొట్టారు. పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాలకు పంపి మరీ చదివించుకుంటున్న సంగతి వీళ్ళకు తెలవక కాదు.

    అభివృద్ధి చెందిన హైదరాబాదును తాము మాత్రమే దక్కించుకుని, మిగతా ప్రాంతాలను వేరు చేసి, తెలంగాణా ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణవాదుల ఆలోచన. మేం అభివృద్ధి చెందలేదు, మా సంపదలను దోచుకున్నారు, అంటూ గోలచేసి కోస్తా సీమలను తమనుంచి వేరు చెయ్యమంటున్నారు. రాజధానో రాజధానో అంటూ గత ఐదు దశాబ్దాలుగా మొత్తం అభివృద్ధినంతా ఇక్కడ పెట్టారు. మిగతా ప్రాంతాల అభివృద్ధిని దీనికి పణంగా పెట్టారు. ఇప్పుడు హై. ను వదిలేసి, బికారుల్లాగా పోయి, అక్కడ కొత్త రాజధాని కోసం పునాదులు తవ్వుకోడం మొదలెట్టాలి. అన్ని ప్రాంతాల ప్రజలు కష్టపడి నిర్మించుకున్న హైదరాబాదు హర్మ్యంలో తెలంగాణ వాళ్ళు మాత్రం కులుకుతారు. ఇదీ అసలు కుట్రంటే!

  • 27. నాయిష్టం నాది  |  November 1, 2009 at 10:43 am

    చదువరి చాల చక్కగా చెప్పారు. వీళ్ళు రాయలసీమ , ఆంధ్ర లీడర్లును కాదు సామాన్య జనాలను దొంగలు అన్న నోరు మూసుకొని కోర్చోనే పరిస్థితులలో జనాలు అన్ని మూసికొని కుర్చుకునే పరిస్తితులలో జనాలు బతుకుతున్నారు అది కనపడదు, ఎవడో ఒక తెలంగాణా నాయకుడు (మళ్ళి అయన ఆంధ్రప్రదేశ్ ని రేప్రేజేంట్ చేస్తూ కేంద్రం లో పదవులు అనుభవిస్తున్నా) పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే కడుపుమండి ఎమన్నా అంటే యావత్ తెలంగాణా ని అన్నట్లు. వెళ్ళు అబివృద్ది చెందినా దేశాలకు వెళ్లి సెటిల్ కావచ్చు(మళ్ళి ఈ NRI లు వాళ్ళ నాయకుడు గారు ఒక విజిల్ గానే వేస్తె డబ్బులు పంపి ఖజానాలు నింపుతారని ఆయన గారి ఉవాచ) , KCR
    గారు ఏళ్ల తరబడి ఢిల్లీ లోకుర్చోవచ్చు అదే రాష్ట్రం కు చెందినా జనాలు మాత్రం రాజధాని లో ఉద్యోగాలు చెయ్యదు , కాలే కడుపులు నింపుకోవటానికి వలసలు రావద్దు. అసలు ఎగతాళి ఎవరు చేస్తున్నారో ఒక్కసారి వీళ్ళ మనసాక్షి తో ఆలోచిస్తే తెలుస్తూంది 24 గంటలు ఆంధ్రోల్లు అట్ట ఆంధ్రోల్లు ఇట్ట అని ఎవరు మాట్లాడుతున్నారో తలుచుకుంటే కడపు రగులుతుంది .

  • 28. sUryuDu  |  November 1, 2009 at 12:05 pm

    తెలుగు మాట్లాడే వాళ్ల మధ్య పొరపొచ్చాలొచ్చి విరోధంతో విడిపోయేకన్నా, సామరస్యంగా (రెండు రాష్ట్రాలు గా) విడిపోయి, తెలుగు ప్రజలుగా కలిసుండడం మంచిదేమో?

    ~సూర్యుడు

  • 29. నాయిష్టం నాది  |  November 1, 2009 at 12:20 pm

    సూర్యుడు గారు విడిపోయేందుకు ఎవరకూ ఇబ్బంది లేదూ కాని అప్పుల గురించి ఎవరూ మాట్లడరూ, అభివృద్ధి అభివృద్ధి అని అప్పులు చేసి రోడ్లు, బిల్డింగ్ లకు హైదరాబాద్ లో ఖర్చు పెట్టినదంతా ఎవరి మీద రుద్దుతారు.

  • 30. Phanikumar  |  November 1, 2009 at 12:25 pm

    @కృష్ణవేణి
    “పసికరికలొచ్చినోల్లకు దునియాంత పచ్చగ్గనిపించినట్టు”… ఆయన చెప్పింది ఆయనకే సరిగ్గా సరిపోతుంది.. :)
    @ శ్రీధర్ రాజు – చికాగొ
    మీ నాయకుడు కేసిఆర్ లాగా మాకు ఛాలెంజ్ లు విసురుతున్నారెంటండీ బాబూ!!
    ముందు తెలంగాణా రాష్ట్రానికీ స్వతంత్రోద్యమనికీ లింక్ పెట్టడం మానండి.. :) అలాగే తెలుగు భాషకీ, ఒక ప్రాంతానికీ కూడా…
    @చదువరి
    సరిగ్గా చెప్పారు… కుట్ర కుట్ర అంటారు మళ్ళీ వివక్ష చూపించేది ఇలాంటి వాళ్ళే…
    @నాయిష్టం నాది
    :)
    ఒక రెండు విషయాలు..
    మన రాష్ట్ర రెవిన్యూ లో 51 % హై. నుంచే వస్తుందట….(2008 స్టాటిస్టిక్స్ అనుకుంట..)
    అలాగే రాష్ట్రం మొత్తం లో వరి ఎక్కువగా పండించే జిల్లా ఏది చెప్పండి…? నిజామాబాద్.. :)
    @ sUryuDu
    “సామరస్యం” కనీసం ఒక తెలుగు పాటని పాడించడం లోనే లేదు.. కొన్నాళ్ళు పొతే ‘తెలుగు ప్రజలు’ అనే కాన్సెప్ట్ కూడా వ్యతిరేకిన్చబడుతుందేమో.. :)

  • 31. Phanikumar  |  November 1, 2009 at 11:41 pm

    అసలు నైజం బయట పడింది.. కేసిఆర్ కి ‘మా తెలుగు తల్లికి’ ‘తెలంగాణా పాట’ లాగ అనిపించట్లేదట.. ఆంధ్ర పాట.. క్షమించాలి.. వలస వాద పాట లా అనిపిస్తోందట..
    “అన్ని ప్రాంతాల మనో భావాలను గుర్తించాలి.. అలాంటప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకల్లో మా పాటను పాడించరా..”
    “సీ ఎం కి విజ్ఞత ఉండి ఉంటే, వలస వాద దురహంకారం లేకపోతె, తెలంగాణా గీతం పాడించడం తో పాటు, జాతీయ గీతానికి ప్రాధాన్యత ఇచ్చి ఉండేవారు..”
    కేసిఆర్ జిందాబాద్…!!
    http://eenadu.net/breakhtml.asp?qry=break25

  • 32. శ్రీధర్ రాజు – చికాగొ  |  November 2, 2009 at 12:09 am

    మీలాంటివారే కేసిఆర్ ను హీరోను చేసింది. నాకు తెలిసి అసలు సిసలు తెలంగాణ హీరోలు వేరే – నేను ముందు చెప్పినట్టుగా గత్యంతరంలేక మద్దత్తిస్తున్నామంతే!

  • 33. శ్రీధర్ రాజు – చికాగొ  |  November 2, 2009 at 12:19 am

    నేను “తెలంగాణేతర వాసుల్లారా, వలసదారుల్లార, తెలుగు భాషాభిమానుల్లారా,” అని మొదలుపెట్టీనదాంట్లో పెడార్థాలెందుకు… నేనేమి అందర్ని వెల్లిపోమనలేదే! వలస పోవడం తప్పని కూడా ఎక్కడా చెప్పలేదు. తెలంగాణా రాష్త్ర విముక్తి, విమోచనం, స్వతంత్రము – అన్నిపర్యాయ పదాలేకదా… స్వతంత్రానికి స్వతంత్రోద్యమనికీ లింక్ నేను పెట్టినా పెట్టకపోయినా అదే నిజం – నేను అదొక ఉదాహరణలా మాత్రమే వాడాను… కాని ఉద్యమం అలా మారే రోజు దెగ్గర్లోనే ఉంది. అది మీరు నేను ఆపాలన్నా ఆగేది కాదు. నేను రెచ్చగొట్టేలా మట్లాడితే దయచేసి క్షమించేయండి. మీరుకూడా అలా మాట్లాడకండి…

    అసలు తెలుగు భాషంతా మీ ఒక్కరి సొత్తే అనకండి. మేంకూడా చిన్నప్పుడు స్కూల్లో “మా తెలుగు తల్లికి… ” అవేశంతో ప్రేమతో పాడుకొన్న వాల్లమే. తెలంగాణలో కూడ చాలా పండితులున్నారు. కాని ఒక్క విషయం మాత్రం సుస్పష్టం – ఈ వాదన, ఏవగింపు ఈ పాట నిశేదంపై కాదు. అర్థంచేసుకోడానికి విశాలమైన హృదయం, మనసు కావాలి. ఆలోచించండి. తెల్లతోలు వెధవల్లాగ ప్రవర్తించకండి.

    ఇక్కడ ఉత్తరప్రత్యుత్తరాలు రాసినవారిలొ, చదువుతున్నవారిలో తెలంగాణలో నివసించిన వారి శాతమెంత – నేను చికాగోకు బ్రతుకుతెరువుకోసం వలస రావడనికి పూర్వం బెజవాడలో కొన్నాల్లు నివసించాను. అనుభవించాను. వివక్ష చాలా స్పష్టంగా వెక్కిరించింది. తాడెపల్లిగూడెం, గన్నవరంలాంటి చిన్న చిన్న ఊళ్ళలో జరిగిన అభివృద్దిని కళ్ళతో చూసాను. గత 40 – 50 ఏళ్ళలో తెలంగాణ ప్రాంతంలో జరిగింది నిలువు దోపిడి – అభివృద్ది కాదు. హైదరాబాదులో సమసిపోయిన అందాలు, పచ్చదనం, సరస్సులు, విశృంకలంగా జరిగిన ఆక్రమణను మీరు అభివృద్ది అంటరా…

    అసలు తెలంగాణకు జరిగిన అన్యాయమేంటో తెలుసుకోండి!
    (video.google.com/videoplay?docid=7730660376611492753#)

    మరొక్క విషయం – ఈ క్రింది లఘు-చిత్రంలో సంగతులు నేను ఏనాడు స్కూల్లో పాఠంగా చదవలేదు – కాని మా తాతగారినుండి తెలిసిన విషయాల్లో ఇది ఓ చిన్న మచ్చుతునక మాత్రమే:
    (video.google.com/videoplay?docid=7247237671139634776#)

    ఈ క్రింద లింకులో నిన్న ప్రచురితమైన యథార్థ విషయాన్ని చదవండి…
    (www.andhraprabha.in/specialstories/article-43713)

    సవినయంతో,
    శ్రీధర్ రాజు – చికాగొ

  • 34. నాయిష్టం నాది  |  November 2, 2009 at 5:32 am

    ఇక్కడ ఉత్తరప్రత్యుత్తరాలు రాసినవారిలొ, చదువుతున్నవారిలో తెలంగాణలో నివసించిన వారి శాతమెంత – నేను చికాగోకు బ్రతుకుతెరువుకోసం వలస రావడనికి పూర్వం బెజవాడలో కొన్నాల్లు నివసించాను. అనుభవించాను. వివక్ష చాలా స్పష్టంగా వెక్కిరించింది. తాడెపల్లిగూడెం, గన్నవరంలాంటి చిన్న చిన్న ఊళ్ళలో జరిగిన అభివృద్దిని కళ్ళతో చూసాను. >>నేను నా చిన్నప్పటినుంచి తెలంగాణా లోనే పెరిగాను. మీరు ఏ రకమయిన వివిక్ష చూసారో రాసింటే బాగుండేది, ఇక్కడ మాత్రం అదుగో ఆంద్రోడు రెండు పూటలు అన్నం తింటున్నాడు అది మన కడుపు కొట్టే అన్న టెండెసి మాత్రం ఇవాల్టి తెలగాణ యువత లో create చేయటం లో మాత్రం TRS నాయకులూ , మేధావులు కృతకృత్యులయ్యారని మాత్రం చెప్పక తప్పదు .
    మాస్టరు తాడేపల్లిగూడెం , గన్నవరం మాత్రమే ఆంద్రలో ఊళ్ళు కావు, కొద్ది గా ఇంకా చిన్న గ్రామాలు తిరిగి చూడండి , చిన్న చిన్న గ్రామాలలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ఇప్పటికి జనాల జీవితాలు ఒకే రకం ఉన్నాయి లేకపోతె ఇన్నాచోటునే కడుపు కదలకుండా కూర్చోకుండా వలసలు ఎందుకు వెళతారు ?

  • 35. నాయిష్టం నాది  |  November 2, 2009 at 5:38 am

    గత 40 – 50 ఏళ్ళలో తెలంగాణ ప్రాంతంలో జరిగింది నిలువు దోపిడి – అభివృద్ది కాదు.
    >> నిలువు దోపిడి అంటే ఇక్కడి సొమ్ము ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టారా? ఎక్కడ పెట్టారో మేఉ సమాధానం చెప్పాలి.
    హైదరాబాదులో సమసిపోయిన అందాలు, పచ్చదనం, సరస్సులు, విశృంకలంగా జరిగిన ఆక్రమణను మీరు అభివృద్ది అంటరా…>> దీని కి కారణం ఏమిటో మీకు కూడా తెలుసు, జనాబా విపరీతం గా పెరిగేఇతే ఏమవుతుంది మరి, అందుకు అన్ని ఇక్కడే కేంద్రీకరించాలి, ఈవల హైదరాబాద్ లో తప్ప ఉదొగ్యం దొరకదు, అక్కడ తప్ప అవకాశాలు లేవు అన్నంత గా ఎందుకు వలసలు జరుగుతున్నై, మరి ఈ మాత్రం కూడా ఆంధ్ర , రాయలసీమ లలో జరగలేదనే మా ఏడుపు .

  • 36. వేములవాడ రాజన్న  |  November 2, 2009 at 6:26 am

    “తెలుగుతల్లి పాట పాడనే వద్దా?” అన్న – పైకి అమాయకంగా కనిపించే ప్రశ్న తో మొదలైన ఈ చర్చా కార్యక్రమం ఏటేటో పోతోంది.
    ఆఖరికి తెలంగాణా వాదులే అసలు కుట్ర దారులు అని తేల్చే దాకా పోయింది.!!!
    చదువరి అంట చదువరి మొఖ మాటం, ముసుగుల గుద్దులాట లేకుండా తెలంగానోల్లె అసలు దోపిడీదార్లు, దొంగలు, దగుల్భాజీలు (దానర్ధం ఇదే ) అని సాఫ్ సీదా తేల్చి పారేసిండు.
    ఆయన కడుపు సల్లగుండ ! తెలంగానోల్ల కుట్రలకు బలై అరిగోస పడుతున్న ఆంధ్రోల్లను, రాయలసీమోల్లను దేవుడు కాపాడ !

    ఇప్పటికైనా ఆంధ్రోల్లు రాయలసీమోల్లు కళ్ళు తెరిచి ఈ కుట్రలకు ఇంకా ఇంకా బలి కాకుండా తెలంగాణా పీడ వదిలించుకోవాలే. 1956 కు ముందు ఉన్నట్టు ఎవరి మానాన వాళ్ళు ఉండాలే. అందుకు అందరూ కృషి చేయాలే. ఇంకా ఎంతకాలం ఈ ఫుజూల్ మాటలు, పరస్పర తిట్లు పంచాయితీలు?
    అందరం కలిసి జై ఆంధ్ర జై తెలంగాణా, జై రాయలసీమ అందం సరేనా? అందుకు మీరు సిద్ధమేనా? తేల్చి చెప్పుండ్రి.
    అంట వారకు మీరు మీ పాట పాడుకొండ్రి.
    మేం మా పాట పాడుకుంటాం.

    ఔ మా పాట ఏందో మీకు తెల్వదు కదూ ….ఇగో ఇదే. మా అందెశ్రీ అన్న రాసిండు.

    జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
    తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
    పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
    జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||

    పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
    గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
    కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
    గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||

    జానపదా జనజీవన జావళీలు జాలువార
    కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
    జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
    అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||

    సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
    అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
    సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
    సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||

    గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
    పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
    సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
    స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి || జై…||

  • 37. Phanikumar  |  November 2, 2009 at 10:46 am

    @ Surendar Reddy – Telangana
    మీ వ్యాఖ్య లో అభ్యంతరమైన పదజాలం వాడడం వల్ల తీసేయడమైనది..

  • 38. Surendar Reddy - Telangana  |  November 2, 2009 at 10:50 am

    మీ కక్కుర్తి బుద్దికి నిదర్శం ఈ చర్చలోనే కనపడ్డదిగదరా …

    శ్రీధరన్నా యద్గిరన్నా నువ్వెంత మంచిగ మన బాధలను చెప్పడానికి ప్రయత్నంజేసినౌ, అసలు ఏ ఒక్కడైనా అర్థం చేసుకున్నాడా? అయ్యో పాపం అన్నాడా? వీళ్ళు మన రక్తం తాగుంతాండ్రు అయినా వాల్లకు దూపతీర్తలేదు.

    ఇసోంటోల్లకు ఒక లక్ష మంది కేసిఆర్లంటోల్లు తిట్ల దండకం సద్వాలె – పొద్దున లేచిందెగ్గర్నించి రాత్రి నిద్రపోయ్యేవరకు అవే తిట్లు ఇనవడాలె. అప్పుడు సమజైతది. చీ! థూ!

  • 39. నాఇష్టం నాది  |  November 2, 2009 at 11:02 am

    సురేందర్ రెడ్డి ఏమి కక్కుర్తి బుద్ది కనపడింది మీకు ఈ చర్చలో . ఎవరు ఎవరి రక్తం తాగుతున్నారు ?
    మీరు చెప్పినదాంట్లో ఒకటి మాత్రం నిజం మీలాంటి వాళ్లకు మీ నాయకుడే కరెక్ట్. He is representing the correct group of people.

  • 40. Surendar Reddy - Telangana  |  November 2, 2009 at 11:36 am

    శ్రీధరన్నా యద్గిరన్నా మీ టైం పాడ్చేస్కోకున్రి – ఈళ్ళకు తెల్గోల్లంతా ఒకటే రాష్ట్రంగావాలని నూరిపోశిన్రు… ఇప్పుడు నరనరాల్లవాక్తాంది! ఏంశెప్పినా అర్థంగాదు అందుకే వేరే పనుల్జేసుకోన్రి.
    జై తెలంగాణ… నా తెలంగాణ కోటిరత్నాల వీణ. జై జై తెలంగాణ!!!

  • 41. Phanikumar  |  November 2, 2009 at 12:10 pm

    @ శ్రీధర్ రాజు – చికాగొ, వేములవాడ రాజన్న
    ఈ టపా ఉద్దేశం ఎవరినీ కించపరచాలనో, తక్కువ చెయ్యాలనో కానే కాదు.. అలాగే తెలంగాణా రాష్ట్రానికి అనుకూలమా కాదా అనేదీ చర్చ కాదు..
    తెలుగు తల్లి పాట గురించి.. అసలు దానికి ఎందుకంత వ్యతిరేకత ఉంది అనే విషయం గురించి..
    ఏమైనా తెలంగాణా పాటని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు…ఐతే ‘తెలుగు తల్లి’ పాటని ఈ పాట పేరు చెప్పి ఆంధ్ర/సీమ వాళ్ళ మీద రుద్దకండి..దాంట్లో అందరు తెలుగు వాళ్ళ గురించీ ఉంది మరి.. ఈ టపా మూల ఉద్దేశ్యం ‘తెలుగు తల్లి’ పాట ఒక ప్రాంతానిది కాదు అని చెప్పడమే….

    ఈ చర్చ సందర్భంగా నాకు తెలిసినదేంటి అంటే, దురదృష్టవశాత్తూ ఆంద్ర/సీమ వాళ్ళకి ప్రత్యేకంగా పాట అంటూ ఏదీ లేదు.. వీలైనంత త్వరగా అక్కడి కవులందరూ తీవ్రంగా అలోచించి పాట(ల) ని తయారు చెయ్యాలి..!!

  • 42. Laxman - Nagpur  |  November 2, 2009 at 12:26 pm

    అన్నా సూరన్న, అంధ్రోడు రెండు గాదు మూడు పూటల మన రక్తపుటన్నం మెక్కుతున్నాడు. ఇక్కడికి ఉద్యోగం కోసమచ్చినోల్లు ఉద్యోగం గాకుండ దందజేసుడు షురుజెసిన్రుసూడు గప్పట్నుండే మన రక్తం రుచిమరిగిన్రు. మా అయ్య నిజాం సుగర్ ఫ్యాక్టరీల పంజేత్తుండె. ఇప్పుడది బందైంది. తర్వాత ఆర్నెల్లకే ఒక ఆంధ్రోడే నిజాం సుగర్ ఫ్యాక్టరీల మెషన్లను కొనుక్కపోయి బొబ్బిలి ఫ్యాక్టరీకి అమ్మిండు – అయ్యను బొబ్బిలికి తీస్కపోయిండు పన్లె పెట్టిస్తానికి – అక్కడోల్లు నెగ్లనియ్యలె – ఇప్పుడు బొధన్ దగ్గర అదే ఆంధ్రోని హోటల్ల మా అయ్య జీతంజేస్తండు. ఇల్లమ్ముకున్నం – చెల్లె పెళ్ళిజేసినం – ఇగో నేను కిందమీదవడి నిజామాబాద్ల పాలిటెక్నిక్ ఖతంజేసి ఉద్యొగం కోసం నాగ్పూరొచ్చిన. ఇది రక్తం తాగుడుగాకపోతె మరేంది. మా అయ్యజెప్తడు – ఇప్పటోల్లకంటె జమిందార్లె మంచిగుండెనట. మన తెలంగాణ మనగ్గావాలె. మన ఫ్యాక్టరీలు మనదగ్గర్నే ఉండాలె. అంతే. జై తెలంగాణ జై జై తెలంగాణ.

    మన పాట మనం పాడుకుందాం – “మా తెలుగు తల్లి..” లేదు… ఒక తెలంగాణ తల్లి మాత్రమే. అంతే. జై తెలంగాణ జై జై తెలంగాణ.

  • 43. నాఇష్టం నాది  |  November 2, 2009 at 12:48 pm

    లక్ష్మన్ అంధ్రోడు నీ రక్తం తాగితే నువ్వు నాగపూర్ వాడి రక్తం తాగుతున్నావా? రక్తం తాగే వాళ్ళ దగ్గరే మీ నాయన ఇంకా ఎందుకు పని చేస్తున్నాడు ? ఇలాంటి జీవితాలు, భాdalu తెలంగాణా లోనే పుట్టి పెరిగినోల్లకే కాదు ఆంధ్రలోల్లను కదిలిచిఇన్న ఇవే కనపడతాయి , రోజు పొద్దున్న పేపర్ లో కనపడే ఒక పదిమంది ని చూసి వీళ్ళే ఆంధ్రోల్లు అనకుంటే మీ ఆలోచనలు ఇలాగే ఉనాటాయ్, ముందు పక్కనోడి మీద పది ఏడవటం మాని మనం బాగుపడటం కోసం ఏమి చేయాలో ఆలోచిస్తే మంచిగా ఉంటది, తెలంగాణా లో సగం కంపెనీ లు ఎందుకు మూతపడ్దొయో మీ నాయన్ననదుకు పక్షపాతం లేడుకుండా ఆలోచిస్తే మీకే తెలుస్తూంది .

    ఫణి గారు చర్చ తప్పు దోవ పడుతుంది మీ ఈ పోస్టు కు వ్వక్యలు మూసేస్తే మంచిదేమొ

  • 44. Laxman - Nagpur  |  November 2, 2009 at 1:02 pm

    గతిలేక! రిటైరయ్యే వయసులో మా అయ్య నీలాగా నాలాగా ఊర్లమీదవడి తిర్గలేడు కదా! మా అయ్యవండిన చక్కర నువ్వుగాకపోయినా అంధ్ర వలసపాలకులు మస్తుగ తిన్నరు.

    నేను రక్తం తాగే సంగతి నాగ్పూరోడు తేల్చుకోని. నేను నాది తాగినోడి గురించే మాట్లాడ్తా…

    అయ్యా – ఈ చర్చ మొదల్వెట్టిన తెలుగబ్బాయి, “మా తెలుగు తల్లికి…” పాట మీద ఎవ్వర్కి కోపంలేదు – శ్రీధరన్నజెప్పినట్టు పోరాటంల దీన్నొక అయుధం చెస్తాన్రు. గంతే.

    జై తెలంగాణ జై జై తెలంగాణ.

  • 45. నాఇష్టం నాది  |  November 2, 2009 at 1:16 pm

    అయ్యా లక్ష్మణ్ మరి అయ్యా, అమ్మలు కూడా అట్లానే కష్టపడుతున్నారు అది నీకు తెలుస్తుందా,
    నీకు కనపడ్డ ఒక పదిమందిని చూసి అంధ్రోల్లంతా అల్లాగే ఏడవకండి మీకేమి తెలుసు ఇక్కడ జనాల భాదలు ఉన్నచోట కపుడునిండా తిని కూర్చోకుండా దేశాల మీద పాడటానికి , ఒక్క సారి ఇక్కడ మామూలు జనాల స్థితిగతులు చూసి అప్పుడు ఏడవండి !
    అంధ్ర వలసపాలకులు తింటే మరి వాళ్ళమీద తన్నండి లేదా వాళ్ళను ఉరి తీయండి ౨౪ గంటలు మామూలు జనాల మీద పడి ఏడవటం మానండి .

  • 46. Mahesh - Nirmal  |  November 2, 2009 at 1:23 pm

    JAI TELANGANA JAI JAI TELANGANA

    MAA TELUGU TALLI…. MAKU LEDU… CHACHIPOYINDI..

    JAI TELANGANA JAI JAI TELANGANA
    JAI TELANGANA JAI JAI TELANGANA
    JAI TELANGANA JAI JAI TELANGANA

  • 47. Krishna  |  November 2, 2009 at 2:48 pm

    పైన ఎవరో చెప్పినట్టు వీళ్ళ గుంపు నాయకుడు వీళ్ళకు తగినవాడే. వాడేమో రాజకీయాల్లో నేరుగా ఎదిగే దమ్ములేక ఆంధ్ర నాయకులంతా బయటకి పోండి అప్పుడు నేను వెలుగుతాను అంటున్నాడు. వీళ్ళేమో ఆంధ్ర వాళ్ళ వల్ల మా ఉద్యోగాలు పోయాయి అని అంటున్నారు. ఇప్పుడు నిలబెట్టుకోలేని ఉద్యోగాలు, వ్యాపారాలు రేపు తెలంగాణ వస్తే మాత్రం ఎలా నిలబెట్టుకుంటారో మరి. ఆంధ్ర వాళ్ళు పోతే ఇంకో మహారాష్ట్ర వాళ్ళో, బీహార్ వాళ్ళో వస్తారు, పోటీగా వ్యాపారాలు పెడతారు, ఇదే చేస్తారు. ఇప్పుడు నిలబెట్టుకోలేని వాళ్ళు అప్పుడు కూడా నిలబెట్టుకోలేరు. ఎవ్వర్నీ రానీయకుండా కట్టడి ఎలా చేస్తారు. కాశ్మీర్ లాగా ఆర్టికల్ 370 తెమ్మంటారా? ఇండియన్ గవర్నమెంటు లెక్క కూడా చెయ్యదు. తెలుగు తల్లితో మాకు ఏమీ గిట్టుబాటు కాలేదు, మాకు భారతమాతే ముద్దు అనేవాళ్ళకు అప్పుడు తెలుస్తుంది, ఏ తల్లి సంగతి ఎంతో.

  • 48. Phanikumar  |  November 2, 2009 at 8:00 pm

    @ Laxman – Nagpur
    పెట్టుబడిదారీ విధానం మీద ఉన్న కోపాన్ని మీరు ఒక ప్రాంతం మీద చూపిస్తున్నారు….
    అన్నా.. ఆంధ్ర దోపిడీ గాండ్లు గాకపోతే ఏ పటేలో, సేటు లో, ఖాను లో వస్తరు రక్తం తాగనీకి.. అప్పుడు ఎవరని అంటవ్ మరి? ఆంధ్ర లో సెజ్ ల గోల చదివినవా? ఆడ కూడ దెబ్బ తిన్నాది ఇసుమంటి పేదోల్లె.. పొట్ట చేత పట్టి నువ్వు నాగ్పూరు పోయినట్టు ఆల్లు కూడ హైద్రాబాదు వచ్చేటిది అందుకే…
    సరే అది వేరే విషయం.. ఇంకో సారి చర్చించ వచ్చు…. నేను చెప్పేది పోరాటానికి ఆయుధం అని చెప్పి ఈ పాటని victimize చెయ్యడం వల్ల మొత్తం గా తెలుగు అమలుకి ఇబ్బందులు ఏర్పడతాయి అని..

  • 49. శ్రీధర్ రాజు - చికాగో  |  November 3, 2009 at 12:35 am

    అవును, అమాయక ప్రశ్నతో మొదలైన ఈ చర్చ దాని హద్దులు దాటి ఒక నగ్న సత్యాన్ని మనముందుంచింది. తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమేంటో ఇప్పటి జనానికి కనీస అవగాహన లేదని. తెలియకుండ చేయడంకూడా అణచివేతలో భాగమేనని!

    ఇక్కడి అమాయక ప్రజలకు సహనశక్తి ఓర్పు చాలా జాస్తి. చాలా శాతం కోప తాపాలకు బహు దూరం.

    హైదరాబాదులోనే కాదు మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే పెట్టుబడీదారి వ్యవస్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే చాలా ముందునుంచే ఉంది. దాన్నెవ్వరు ఎదిరించాల్సిన అవసరం లేదు. తెలంగాణ వ్యాపారంలో ఆర్జించి స్థానిక సామాజికాభివృద్దిలో పాలుపంచుకోక మొత్తంగా వేరేచోట వృద్దిచెందటానికి తోడ్పడే అలోచనా కాంక్ష కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న మార్వాడి, బెంగాలి, పంజాబీ, గుజరాతీ సేఠ్లకు లేదు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో విషయం – 1948 నుండి 1956 వరకు హైదరాబాదు రాష్ట్రానిది ప్రతి ఏటా మిగులు బడ్జెట్టే. ఆ తర్వాతే అప్పుల రాష్ట్రంగా మార్చేసారు వలసపాలకులు.

    ఎన్నెన్ని ఫ్యాక్టరీలు మూతపడేలా చేశారు – ఎంతమంది జనాలు పొట్ట చేతబట్టుకుని చచ్చేలా పాలించారు. ఇదీ ఒక రకమైన జినోసైడ్ (Genocide) కాదా?

    మీర్-అలీ-ఉస్మాన్ అనుకుంటా (పేరు సరిగ్గా గుర్తులేదు) హైదరాబాదు రాష్ట్రంలో చీఫ్ ఇంజనీరు, ఒక పాత బ్రిటిష్ కాలం నాటి యోచనకు మార్పులు చేర్పులు చేసి మళ్ళీ తిరిగి ప్రవేశ పెట్టాడు – హైదరాబాదు నుండి సిరిసిల్ల వరకు ఒక ఇండస్ట్రియల్ కాలనీ అభివృద్ది చేస్తానని. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మద్దత్తు తెలిపి నిధులు కూడా సమకూర్చారు. కాని వలసపాలకులు దానికి కేటయించిన నిధులు గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్ళించారు. తర్వాత ఆ చీఫ్ ఇంజనీరు దేశం వదిలిపోయి హాంగ్ కాంగ్ యేర్పాటులో పాలుపంచుకున్నాడు.

    ఇప్పటి రాజీవ్ రహదారి ఆ యోచనలో భాగమే! దానిలో ముఖ్యమైన రైలుమార్గం కూడా ఉండింది – కాని ఇప్పుడు మనకందరికి తెలుసు – ఆ రైలు మార్గం తెలంగాణలో ప్రవేశించినా కాజిపేట గుండా ఎలా దారి మల్లిందో. మంచిర్యాల నుండి కూతవేటు దూరంలోనున్న రామగుండం మధ్య గోదావరి నది పైన (ఇప్పటి రాజీవ్) రహదారి మీద వంతెన కట్టడానికి 50 సంవత్సరాలు వేచి చూసారిక్కడి ప్రజలు. 15 నిమిషాల్లో చేరుకునే దూరాన్ని గూడెం గుట్ట వంతెన మీదగా 3 గంటలు పట్టేది జనానికి. ఇది యధార్థ సంఘటణ. ఆంధ్రలో పల్లె పల్లెకి ఊరూరికి ఎన్నెన్ని వంతెనలు కట్టారో నేను కళ్ళారా చూసాను. ఇలాంటి పచ్చి నిజాలు రాష్త్రమంతటా ఉన్నాయి కాని తెలంగాణ ప్రాంతంలో కోకొల్లలుగా కాస్తా విపరీతమైన మొతాదులో కనిపిస్తాయి. దీన్ని మీరు ఏ కొందరికో జరిగిన అన్యాయం అనుకుంటారో లేక ఒక ప్రాంతం మీద వివక్షో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

    కేసిఆర్లాంటి లీడర్లకు మరో గతిలేక మద్దత్తు ఇస్తున్నాను(ము) అనిచెప్పినా మళ్ళి మళ్ళి ఈ ఉద్యమానికి వాడొక్కడే నాయకుడు అన్నట్టుగా మీరే ఊహించుకుని ఆక్షేపిస్తున్నారు. ఇక చేప్పేదేంలేదు. సెలవు.

    మళ్ళీ వేరే చర్చలో తటస్తపడితే పలకరించండి. మరివుంటాను.

    నిష్కపటముగా నిష్కళంకముగా,
    శ్రీధర్ రాజు – చికాగో

  • 50. krishna  |  November 3, 2009 at 5:00 am

    @సికాగో శ్రీధరా,

    “మంచిర్యాల నుండి కూతవేటు దూరంలోనున్న రామగుండం మధ్య గోదావరి నది పైన (ఇప్పటి రాజీవ్) రహదారి మీద వంతెన కట్టడానికి 50 సంవత్సరాలు వేచి చూసారిక్కడి ప్రజలు” ok,

    అలాగే క్రిష్ణ, గుంటూరు జిల్లల మధ్యన వంతెన కోసం జనాలు (మీరు బ్రమపడే గొప్ప ఆంధ్రవోల్లు) 60 సంవస్తరాలుపైగా వేచిచూసారన్న సంగతి మీకు తెలుసా?
    పెనుమూడి, రెపల్లె మద్దెన ఆ వంతెన లేక, లంక గ్రామాల వాళ్ళు, అటుపక్క దివిసీమ, చల్లపల్లి ప్రాంతాల వాళ్లు, ఇటుపక్క రెపల్లె దిగువ వాళ్లు ఎంత ఇబ్బందులు పడ్డారో, మీకు తెలుసా?
    పెనుమూడి నుండి కనిపిచే రెపల్లె పక్కన ఉన్న రైలు ఎక్కాలంటె, కనీసం రెండొం, మూడొ నావలెక్కి (పడవలు), మధ్యలో మేటేసిన ఇసుక పైనుండి నడిచి వచ్చి ఎక్కల్సివచ్చేది, ఇప్పుడు వంతెన పడ్డాక పడుతున్న సమయం తెలుసా అరగంటలోపు.
    ఆ తిప్పలు పడలేక, అటునుండి, ఇటు కనిపిచే గ్రామాలలో కూడా సంబంధాలు కలుపుకోవాలంటే జంకేవారు.

    ఇక ఎంతమంది దిగువ గ్రామాల వాళ్లు లాంచిలు, పడవ ప్రమాదాలు, ఆ వంతెన లేకపోవటం వలన రెపల్లె వైపు ఉన్న ఆసుపత్రిలకు సరీయీన్ సమయం లో వెళ్లలేక ప్రాణాలు (ముఖ్యం గా గర్భిణిలు) ఆ ప్రాంతాల వాళ్లకే తెలుసు.
    అంతెందుకు, మొన్న కరకట్టకు గండి పడి వందల కోట్లు నష్టం వచ్చింది అని మీకు తెలిసేవుంతుంది కదా ఆ ప్రాంతం లో, దానికి కారణం తెలుసా? అప్పుడెప్పుడో బ్రిటీషువాడి పోసిన తరవాత ఓ గంప మట్టి కూడ ఆ కరకట్ట మీద పోయక పోవటం.
    దానికి తెలంగాణా వాళ్లను blame చెయ్యమంటారా మమ్ములను, లేక మా ప్రాంత నాయకులను blame చెయ్యమంటారా?
    ఇక మీరు చూసిన ఆంధ్ర ప్రాంత పల్లెలు పచ్చగా ఉండొచ్చు గాని, అతి భయంకర దారిద్రము ఎప్పటినుండొ అనుభవిస్తున్న పల్లెలే కాక, పచ్చగా బతికి ఇప్పుడు వల్లెకాడులయిన పల్లేలు కూడా, తెలంగాణా లాగానే ఆంధ్రా అంతా ఉన్నాయి.
    ఒక్కసారి, బెంగులూరు లో కూలి జనాభాను చూసి వాళు ఎక్కడివాళ్లొ, అంతమునుపు ఎంత పచ్చగ్గ్ శెనిక్కాయలు, బావుల కింద పొలాలు చేసుకొంటూ ఇప్పుడు వాళ్ల బతుకులు ఎందుకు ఇలా అయ్యాయ్యొ అడగండి.

    ఇక సెజ్ లకింద పోయిన భూములు, గత అయిదు ఏళ్లలో సెజ్ లకింద తెలాంగాణాలో లాక్కొన్న భూములు కంటే కనీసం 2,3 రెట్లు ఆంధ్రా, రాయలసీమ లలో లాక్కున్నరన్న సత్యం మీకు తెలుసా???
    తడ (నెల్లొరు జిల్లా) దగ్గరనుండి, రెఫల్లె (గుంటూర్ జిల్లా) వరకు ఒక్క శ్రీహరికోట, బాపట్ల సూర్యలంక సైనిక స్తావరం మినహాయించి మొత్తం తీర ప్రాంతం అంతా (సెజ్ పేరుతో, క్రిష్ట్న పట్టనం పోర్ట్, మోటుపల్లి పోర్ట్, వాంపిక్) లాక్కుంటున్నరని మీకు తెలిసా? దానివలన ఒకప్పుడు ఓ మాదిరిగా బతిన యానాదుల (అనాదిగా వేల ఏళ్లుగా ఈ ప్రాంతం లో ఉంటున్న) ఓ జాతి మొత్తం నాశనం అవుతుంది అని మీకు తెలుసా?
    ఇక అసలే కరువుతో, అడుగంటిన బావులతో అల్లాడుతున్న అనంతపురం లో సైన్స్ సిటీ పేరుతో ఎంతల్ లాకున్నరో ఒక్కసారి తెలుసుకోండి.

    ఇక అభివ్రుద్ది మాటకు వస్తే, 1956 లో తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, హైస్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్నివున్నాయి అని (కాస్తో కూస్తో తెలివి గలవాళ్లు అయిన)మీరు ఓ spreadsheet వేసి పోల్చండి, అప్పుడు నిజాలేమిటో తెలుస్తాయి.

    ఇక ఉద్యమాలు కిందకు వస్తే 1969 లో తెలంగాణా ఉద్యమానికి 300 మంది బలి అయితే, 250 మంది 1972 లో ఆంధ్రా ఉద్యమానికి బలి అయిన సంగతి మీకు తెలియదా?

    చివరాఖరగా ఎదో సికాగో లో, ఉంటున్న అంటున్నారు, మీరు KCR లాగా పిచ్చి కూతలు కూయటం లేదు కాబట్టి, ఒక్కసారి నేను అడిగిన గత అయిదు ఏళ్ల సెజ్ వివరాలు గాని, లెక 1956 నుండి వచ్చిన ఇస్కూళ్లు, విస్వవిద్యాలయాల లెక్కలు గాని కట్టి ఓ spreadsheet వేసి చూసుకోండి, ఆ తింగరి KCR లేక నా లాంటి తింగరి బుచ్చయ్య మాటలు కాకుండా, మీకే నిజాలు తెలుస్తాయి (తెలుసుకోవాలనుకొంటే ఉద్దేశ్యం ఉంటే).
    లేదు KCR లగా శరభ శరభ అంటూ కొరడా పెట్టి వీధులలో కొట్టుకొనే వాళ్లు, వాళ్ల పక్కన డప్పు వాయించే వాళ్ల మాటలే మీకు ప్రమాణికం అనుకొంటే ఈ చర్చ అక్కర్లేదు.

  • 51. Laxman - Nagpur  |  November 3, 2009 at 7:05 am

    “ఇలాంటి పచ్చి నిజాలు రాష్త్రమంతటా ఉన్నాయి కాని తెలంగాణ ప్రాంతంలో కోకొల్లలుగా కాస్తా విపరీతమైన మొతాదులో కనిపిస్తాయి. దీన్ని మీరు ఏ కొందరికో జరిగిన అన్యాయం అనుకుంటారో లేక ఒక ప్రాంతం మీద వివక్షో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.”
    …. అన్రాశారు కదా సోదరా కృష్ణ!

    తెలంగాణ్ల అన్యాయం జరిగిందంటే ఇంకోదగ్గర జరగలేదన్నట్టుగాదు. మీరు సంజాయిషి చెప్పకంటేముందే, దునియాకు తెల్సు మన రాష్ట్రంల వలసొచ్చిన గవర్నమెంటోల్లెవ్వలకు దమ్ముల్లేవని – మనండ్ల మనం కొట్కసత్తన్నమని. మన సొమ్ముతోని దేశాన్నుద్దరిస్తాంటే వీళ్ళు కిమ్మనకుండ సెంట్రలోనిదెగ్గర చేతుల్గట్ట్తుకుని తల్కాయ దించుకుంటరు. ఆళ్ళేమో సెజ్లంటరు ఇంకెమో అంటరు మనయన్ని దొబ్కపోతరు. మనకొచ్చేటియన్ని తమిళోల్లకో, బెంగాళోల్లకో లేకుంటే బీహారోల్లకు పోవట్టె. వలసొచ్చి పాలించెటోల్ల బొత్తల్నిండి సల్లంగుంటే సాలన్నట్టు. పబ్లికేమైతే వాళ్ళకేంది.

    కలిసుంటే మనందర్ని గిట్లనే దోసుకుంటరు – ఇప్పుడుజూడు నార్త్ ల విడిపోయిన చిన్న చిన్న రాష్త్రాలకు నిధులెట్ల ఇస్తున్రో. డిసెంబర్ల రాంచికివోతన్న మేనేజర్గ. మనదగ్గర్నేమొ ఉద్యోగాలకోసం కొట్టుకుంట్టాన్రు.

    అందుకే విడిపోవాలె – మాకు తెలంగాణ ఇంచ్చేయిండ్రి మీరు ఆంధ్ర తీస్కోండ్రి. 1956 కంటె ముందెట్లున్నమో అట్లనే ఉందాం అంతె.

    జై తెలంగాణ జై జై తెలంగాణ :)

  • 52. Mahesh - Nirmal  |  November 3, 2009 at 7:39 am

    ఖేల్ ఖతం దుకణం బంద్! మాదిమాకు మిదిమికు..

    [ ఇంత మంచిగ్ తెల్గుల ఎట్ల్ రాస్తాండ్రుby - నాక్ type cheyyottaledu ]

    JAI TELANGANA JAI JAI TELANGANA
    JAI TELANGANA JAI JAI TELANGANA
    JAI TELANGANA JAI JAI TELANGANA

  • 53. krishna  |  November 3, 2009 at 10:36 am

    “తెలంగాణ ప్రాంతంలో కోకొల్లలుగా కాస్తా విపరీతమైన మొతాదులో కనిపిస్తాయి. దీన్ని మీరు ఏ కొందరికో జరిగిన అన్యాయం అనుకుంటారో లేక ఒక ప్రాంతం మీద వివక్షో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.” అందుకే

    నేను అన్నది ఓ spread sheet వేసి చూసి మాట్లాడమని జాబు ఏ ఒక్కరి విజ్ఞత లకి వదలాల్సిన పనిలేదని. కేతిగాడి పక్కన డప్పులు కొట్టుకొనేవాళ్లను మాట్లాడినట్లు మాట్లాదితే పెద్దగా ఉపయోగం ఏముంటుంది.
    విడిపోవాల్సి వస్తే 1956 వరకు వెనక్కు వెళ్లటం ఎందుకు, ఏ 1947కో, 1857కో, లేక ఇజయనగర రోజులకో వెళ్ళవచ్చు కదా :)

    సుబ్బరంగా రాస్ట్రమంతా ప్లెబిసైట్ పెట్టేసి విడగొడితే ఏ ఇబ్బందీ ఉందదు. తెలంగాణా వాళ్లతో కల్సిఉండాలో, ఆంధ్రా వాళ్లతో కలసి ఉండాలో, లేక వాళ్లు autonomous ఉంటారో (గ్రేటర్)హైదరాబాద్ వాళ్ల ఇష్టం, అలాగే ఉత్తర కోస్తా వాళ్లు విశాఖ రాజధానిగా ఓ రాష్ట్రం కావాలంటరో, లేక మిగతా వాళ్లతో కలసి ఉంటారో, అలాగే రాయలసీమ జిల్లలు తమిళనాడు లో కలుస్తాయొ, కర్నాటకాలో కలుస్తాయో, కోస్తా వాళతో కలుస్తాయో, ఖమ్మం వాళ్లూ కరీమ్నగర్ వాళ్లతో కల్సి ఉందామంటారొ, లేక కొస్తాలో కలుస్తామంటరో వాళ్ల వాళ్ల అభిప్రాయాలు తెలూసుకొని పోల్ ద్వారా అలాగే విడిపోవటం (once for all) మంచిదే.

    అంతేకాని కల్లు తాగిన కోతుల్లాగా పిచ్చికూతలు కూస్తూ blackmail చేసి (మనకెటూ కష్టపడి సంపాయించుకొనే సత్తలేదన్న నిజం తెలుసుకాబట్టి) మామూళ్ళు వసూలుచేసుకొంటూ గడిపే వాళ్ల మాటలకు భయపడి మాత్రం విడిపోవటం ఉండకూడదు అంటే ఆంధ్రప్రదేశ్ అంతా సై అంటున్నది అన్న నమంకం నాకుంది, మీకుందా?? :)

    ఇక కొట్టే జై జై లేదో పాపం kcr కు కొట్టండి అసలే ఈ మద్దెన సిక్కిపోయిండంట జై జైలు తగ్గి :)

  • 54. నాఇష్టం నాది  |  November 3, 2009 at 11:08 am

    @ Krishna reply is too good. You hit the nail.

  • 55. naalonenu  |  November 3, 2009 at 11:12 am

    మీలో ఎంత మంది గమనించారో తెలియదు గానీ, ఆంధ్రా ప్రాంతంలో ఏ మూలకు వెళ్ళినా అది విజయవాడ కావచ్చు, విజయనగరం కావచ్చు, గుడిసెలు కనిపిస్తాయి. అదే నాకు మటుకు మంచిర్యాలలో అయినా, మహబూబ్ నగర్ లో అయినా ఎందుకనో అవి కనిపించవు.
    అభివృద్ధి అంటే… విజ్ఞులు చెప్పగలగాలి.

  • 56. చదువరి  |  November 3, 2009 at 11:50 am

    “దిక్కుమాలిన …” తెలుగు తల్లి అని మాట్లాడారిక్కడ. మూడేళ్ళ కిందట కేసీయారు కూడా సరిగ్గా ఇదేమాట వాడాడు.

    మీరు వేరు, మేం వేరు అని చెప్పుకోవడానికి వచ్చిన పాట్లు ఇవన్నీ. వేరువేరని చెప్పి, బూతులు తిట్టి, అడ్డగోలుగా మాట్టాడి, సామాన్య జనాన్ని రెచ్చగొట్టడం అసలు లక్ష్యం. కేసీయారు ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అప్పుడు వోట్ల కోసం ఈ గొడవ అవసరమైంది. చతికిలబడ్డ తెలంగాణా ఉద్యమాన్ని లేపి నిలబెట్టడం ఇప్పటి లక్ష్యం. అందులో భాగమే ఈ తెలుగుతల్లి వ్యతిరేకోద్యమాలు, తిట్లు, భాగో జాగోలు, అవమానించడాలు.

    అసలీ కేసీయారు “దిక్కుమాలిన” అనేమాట అన్న వెంటనే, దంటు కనకదుర్గ అనే వ్యక్తి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాసారు. ఆవిడ రాసిన రాతల ముందు ఇక్కడి నెత్తురుకూడు, రక్తం పీల్చడం లాంటి ముతకమాటలు పెద్ద లెక్కలోనివి కావు. ఆవిడ ప్రకారం అసలు కోస్తా, సీమలకు తెలుగుతో సంబంధం లేదు. తెలుగు పూర్తిగా తెలంగాణదే. అంచేత తెలుగు తల్లి అనే మాట కోస్తా సీమలకు చెందదు – పూర్తిగా తెలంగాణదే! :)

    ఆవిడ రాతల్లో మచ్చుక్కొన్నివిగో..
    ————————-
    “…శంకరంబాడి సుందరాచారి అని బాపట్లకి చెందిన ఒక కవి ఈ తెలుగు తల్లిని సృష్టించాడు. అప్పటిదాకా ఎవరు రాసినా, ఎవరు మాట్లాడినా ‘ఆంధ్ర’ అన్న పదమే వాడేవారు.”

    “అయితే ఆంధ్ర అన్నది సంస్క­ృతానికి దగ్గరగా ఉండడంతో, లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడానికి మొట్టమొదటి దోపిడీదారుగా ఆయన తెలంగాణకి సంబంధించిన ‘తెలుగు’ అన్న పదాన్ని దొంగిలించి తన పాటలో పెట్టుకున్నాడు.”

    “ఈమధ్య తెలుగుతల్లి గురించిన వాదోపవాదాలు వాడిగా, వేడిగా సాగుతున్నాయి. తెలుగు అనేది వారి సొత్తయినట్టు, తెలుగుతల్లి అంటే వారొక్కరి తల్లి అయినట్టు ఆంధ్ర సోదరులు ఆవేశపడిపోతున్నారు.”

    “తెలుగు అన్న పదం భాషాపరంగా చూస్తే త్రిలింగ అన్న పదానికి దగ్గరగా ఉంది. చారిత్రకంగా త్రిలింగదేశంలో ఉన్నవాళ్లని అప్పటి ముస్లిం పాలకులు ‘తెలుగు’ ప్రాంతమనీ వారు మాట్లాడే భాషని ‘తెలుగు’, ‘తెలంగి’ అన్నట్టు మనకు తెలుస్తోంది. ఉర్దూలో తెలుగును తెలంగి అంటారు. ఇది క్రమంగా తెలుగు అయింది అనుకోవచ్చు. అంటే త్రిలింగదేశంలో ఉన్నవారు తెలుగువారు. త్రిలింగదేశం అంటే- ఒకవైపు కరీంనగర్‌లోని కాళేశ్వరం, ఇంకోవైపు ద్రాక్షారామం, దక్షిణంవైపు శ్రీశైలం- ఈమూడు లింగేశ్వర క్షేత్రాల మధ్యనున్న ప్రదేశం. ఇది 95 శాతం తెలంగాణలోకి వస్తుం ది. అంటే ఇప్పటి తెలంగాణ వారు మాత్రమే తెలుగువారు అనుకోవలసి వస్తుంది. తెలుగు తెలంగాణ వారి స్వంతభాష. మాతృభాష.”

    “తెలుగు భాషని, తెలుగుతల్లిని ఉద్ధరిస్తున్నామంటున్న ఇప్పటి సోదరుల జాతి ‘ ఆంధ్రజాతి’. వారు తెలుగు వారు కాదు.”

  • 57. చదువరి  |  November 3, 2009 at 12:02 pm

    కృష్ణ: గమనించారా.. మేమభివృద్ధి చెందలేదు, మమ్మల్ని దోచుకున్నారు, మాకు అన్యాయం చేసారని గోల చేసి, విడిపోవాల్సిందే అన్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని మీరు సోదాహరణంగా చెప్పాక, ఆహా.., మీది తెనాలే మాది తెనాలే, పద మనం చక్కగా విడిపోదాం అని అంటున్నారు. :)

  • 58. సుజాత  |  November 3, 2009 at 1:23 pm

    krishna
    మీరు బేరీజు వేసి ఇచ్చిన అభివృద్ధి వివరాలు, మీ అభిప్రాయాలు కూడా సూటిగా, నిక్కచ్చిగా ఉన్నాయి.చాలా చక్కగా చెప్పారు. అభినందనలు!

  • 59. Phanikumar  |  November 3, 2009 at 2:43 pm

    @ krishna
    (ఇది కొద్దిగా ఆఫ్ టాపిక్ అయినప్పటికీ) చాల బాగా చెప్పారు.. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.. ఇదే సమస్య మా ఊరినుంచి కాకినాడ వెళ్ళడానికి.. ౩ గంటలు పైగా పట్టేది, గోదావరి మధ్యలో ఇసక.. కనీసం ఒక కిలో మీటర్ కాళ్ళీడ్చుకుంటూ నడవాల్సి వచ్చేది.. దాదాపు 40 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత బాలయోగి పుణ్యమా అని ఇప్పుడు గంట కంటేతక్కువ లో వెళ్ళ గలుగుతున్నారు.. ఎవరో రైల్ మార్గం గురించి చెప్పారు.. కోటిపల్లి నుంచి నర్సాపురం లైన్ దాదాపు 50 ఏళ్ల నుంచి నలుగుతూనే ఉంది.. ఈ రోజుకి కూడా వస్తుందో రాదో తెలియదు.. 500 కోట్లు ఖర్చు అయ్యే దానికి ఏడాదికి ఒక కోటి విదిల్చేవారు.. 2008 నుంచి అది కూడా లేదు..
    ఇలాంటి ఉదాహరణలు కావాలంటే బోలెడు ఉంటాయి వాదన కోసం…

    సరే అసలు విషయాన్ని పక్కకి పెట్టి బోడి గుండు కి మోకాలికి లంకె పెడితే చెయ్యగలిగేది ఏమి లేదు గా.. కానివ్వండి ఇంకా ఏమేమి బహిష్కరణలు చూస్తామో..

  • 60. Mahesh - Nirmal  |  November 3, 2009 at 7:20 pm

    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)

  • 61. నాయిష్టం నాది  |  November 3, 2009 at 7:37 pm

    ఏందీ మహేష్ అన్న టైపింగ్ బాగా నేర్చుకునట్టున్నావ్ ! ఫుల్ కుషీ గా ఉన్నావు .

  • 62. చక్రవర్తి  |  November 3, 2009 at 9:10 pm

    ఇంతగా గొడవ చేస్తున్న తెలంగాణా వాదులారా ఒక్క మాట .. ఒకే ఒక్క మాట నిజం గ్రహించే ధైర్యం మీకుందా.. ఉంటే .. జనాల్లోకి వెళ్ళండి .. జనాల నాడి ఏమిటో గ్రహించండి. అంతే కానీ యదవ రాజకీయ్యాలు చేస్తున్న కుహనా పెద్దమనుష్యుల మాటలు కాదు మీరు గమనించాల్సింది.

    సామాన్య మానవుడు నిజ్జంగా తెలంగాణా కావాలనుకుంటున్నాడా.. లేక ఆంద్రాని వేరు చేస్తే వచ్చే ముఖ్యమంతి పదువులో లేక రాష్ట్ర పదవులకై ఆబగా ఎదురు చూస్తున్న చెకోర పక్షుల లాభాపేక్షకు మీరు తలలొగ్గుతున్నారా అని ఒక్క సారి గుండెపై చెయ్యి వేసుకుని ఆత్మావలోకనం చేసుకోండి.

    ఏది ఏమైనా మీ వాదన తెలంగాణాపై కానీ తెలుగు పై కాదు కదా, ఏమి లేని వేళ్ళల్లో ఏదో ఒకటి చేసి మీ ఉనికిని చాటుకోవాలనా మీ ప్రయత్నం?

    నాకైతా వీళ్ళందరూ అసందర్బ ప్రేలాపనలు చేస్తున్నరనిపిస్తోంది

    అర్దవంతమైన చర్చ

  • 63. Surendar Reddy - Telangana  |  November 3, 2009 at 11:15 pm

    ఓ చక్రవర్తి,
    తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు – కెసిఆర్ గాడు కూడా పెద్ద తెలివున్నోడేంగాదు. పవర్ కోసం పదవుల కోసం ఎవనెవంతోనో పొత్తుల్వెట్టుకున్నడూ సంకల్నాకిండు. మీలాంటోల్లె గాన్ని హీరోంజేసిన్రు. ఈ పాట నిశేదం ఆంధిమాఖ్లవుట్టలే. మహాపండితులు చెప్పిన్రు. ఆనికిప్పుడు ఏంపన్లేక దాన్ని దొర్కవట్టిండు.

    పైన శ్రీధరన్న రాజన్న తెలంగాణకు సపోర్టుజేసే మిగతావోల్లు చెప్పేదిగూడా అదే – మామూలు జనంలకుపోయి ఏ ఒక్క పార్టిగాని లీడరుగాని మేము తెలంగాణ ఇవ్వమనిజెప్పమనున్రి – ఎవ్వనికి దమ్ముల్లేవ్ – అతా పత్తాలేకుండ కొట్కపోతరని అందర్కి తెల్సు. అందుకే ఎవ్వర్జెప్పరు. “సామాన్య మానవుడు నిజ్జంగా తెలంగాణా కావాలనుకుంటున్నాడా…” అనెంత అమాయకంగా అడిగినవ్. ఇది మల్లన్నతోడు నిజమన్నేంజెప్తే నువ్వు నమ్ముతావ్?

    అదే ప్రశ్న నేను నిన్నడిగితే – “ఒక్క సారి గుండెపై చెయ్యి వేసుకుని ఆత్మావలోకనం చేసుకోండి” తెలంగాణను ఆక్రమించుకుంటన్రు ఇక్కడోల్లను తొక్కిపడెస్తాన్రెంటె నీకర్తమైతందా?

    పైన శ్రీధరన్న ముద్దుగ చెప్పిండుగదా…సమజ్గాలె!
    >>నా దృష్టిలో, ఈ పాటనిషేదం పోరాటంలో ఒక ఆయుధం మాత్రమే – అంతేకాని దాంట్లో ఏదో తప్పు రాసుందని ఎవరన్నారు.

    >>గాంధి గారు ఖద్దరు ధరించి – విదేషి వస్త్రధారన బహిష్కరించలేదా? అప్పుడు తెల్లతోలు మహామహులు మీకులాగె కొంపలారిపొతున్నట్టు వస్త్రంలో ఏముందని గగ్గోలు పెట్టలేదా?

    >>మన దేశంలో హింది ప్రముఖంగా మాట్లాడే 12 రాష్ట్రాలు లేనిది – 2 లేదా 3 తెలుగు మాట్లాడే రాష్ట్రాలుంటే తప్పా. ఆ రాష్ట్రాల్లో హింది-మాత గురించి వినలేదే! అంత మాత్రాన హింది మాట్లాడడం మానేయలేదే!

    శ్రీధరన్నసోంటోల్లు చికాగోలగాదు వాపస్రావాలె – కేసిఆర్లంటోల్లు మాయంగావాలె

    జై తెలంగాణ జై జై తెలంగాణ :) :) :)

  • 64. Phanikumar  |  November 3, 2009 at 11:31 pm

    @Surendar Reddy – Telangana
    >>పైన శ్రీధరన్న ముద్దుగ చెప్పిండుగదా…సమజ్గాలె!
    >>>>నా దృష్టిలో, ఈ పాటనిషేదం పోరాటంలో ఒక ఆయుధం మాత్రమే – అంతేకాని దాంట్లో ఏదో తప్పు రాసుందని ఎవరన్నారు.
    ఇది మరీ బాగుంది.. తప్పు లేదంటారు కానీ .. అది ఆంధ్రోళ్ళ పాట అని కేసిఆర్ అంటాడు గా అది తప్పు కాదా? ఇప్పుడు కూడా గతి లేక కేసిఆర్ని నాయకుడిగా ఎన్నుకున్నాం అని తప్పించుకుంటారా? :)

    >>గాంధి గారు ఖద్దరు ధరించి – విదేషి వస్త్రధారన బహిష్కరించలేదా? అప్పుడు తెల్లతోలు మహామహులు మీకులాగె కొంపలారిపొతున్నట్టు వస్త్రంలో ఏముందని గగ్గోలు పెట్టలేదా?

    అదిగో మళ్ళీ స్వతంత్ర పోరాటం…! అది “విదేశీ” వస్త్ర ధారణ మాస్టారూ… తెలుగు విదేశీ నా? మీ ప్రాంతం గురించి రాసి ఉన్న తెలుగు తల్లి పాట విదేశీ నా?? మీకే విదేశీ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దాదాపు అన్ని ప్రాంతాలకీ విదేశీ నే!!

    >>మన దేశంలో హింది ప్రముఖంగా మాట్లాడే 12 రాష్ట్రాలు లేనిది – 2 లేదా 3 తెలుగు మాట్లాడే…

    ఉండాల్సిందే.. కానీ దానికి ప్రాతిపదిక మీరు చెప్పేవి కాదు.. (దోపిడీ, అన్యాయాలు, రక్తం తాగడం వగైరా..!).. :)

  • 65. Mahesh - Nirmal  |  November 4, 2009 at 12:07 am

    nayana phanikumar,

    2 లేదా 3 తెలుగు మాట్లాడే…రాష్ట్రాలు ఉండాల్సిందే.. annavu
    కానీ దానికి ప్రాతిపదిక మీరు చెప్పేవి కాదు.. annavu

    mari nuvvujeppu ye pratipadikalundalno… manchiganipiste ma pratipdikalni maarchukuntam.

  • 66. Mahesh - Nirmal  |  November 4, 2009 at 12:07 am

    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)
    జై తెలంగాణ జై జై తెలంగాణ :)

  • 67. Phanikumar  |  November 4, 2009 at 3:36 pm

    @ Mahesh – Nirmal
    ఇన్నాళ్ళకి మార్చుకుంటాం అని మాట ఆయినా అన్నారు.. సంతోషం…
    ఆంధ్ర/సీమ వాళ్ళని ముందు శత్రువులు గా చూడడం మానండి… ప్రజల మధ్య విభేదాలు సృష్టించే పనులు, వ్యాఖ్యలు మానండి.. చిన్న రాష్ట్రాల వల్ల వచ్చే లాభాలు వివరించండి.. హైదరాబాద్ లాంటి points of conflict గుర్తించండి.. మిగిలిన వాళ్ళు రాజధాని ని కోల్పోతారని ఒప్పుకోండి.. సరైన ప్రత్యామ్నాయాలు చూపించండి.. తెలుగు ప్రజల మధ్య విబేధాలు లేవు అని చెప్తూనే, పరిపాలన పరమైన సౌలభ్యాలు ఏ రకంగా పెరుగుతాయో, అది “win-win situation” ఎందుకు అవుతుందో ప్రచారం చెయ్యండి…
    మీ తో పాటు ఆంధ్ర/సీమ వాళ్ళని ఉద్యమం లో పాలు పంచుకునే లా చెయ్యండి… అందరిని కలుపుకోగలిగిన నాడు ఏ సమస్యలు లేకుండా రాష్ట్రం అదే వస్తుంది.. if you can correctly answer the questions ‘why’ and ‘how’, there is no need of accusing others for anything.. The day when an action benefits everybody, it eventually gets universal acceptance and governments will be obliged to do it…

    ఇప్పుడు ఉన్న తెరాసా నాయకత్వం కనీసం ఈ దిశగా ఆలోచించే ప్రయత్నం కూడా చెయ్య లేదు.. ఎప్పుడూ ఉసిగొల్పడం, దాన్ని బాగా తలకేక్కించుకున్న వాళ్ళు నోటికొచ్చినట్టు అనడం.. అంతే..
    ఏదైనా ఈ టపాకి వ్యాఖ్యలు ఇంతటి తో ముగిస్తున్నా.. కామెంటిన వారికి కృతఙ్ఞతలు… నా ఉద్దేశం లో చాలా అర్ధవంతమైన చర్చే జరిగింది….

  • 68. Dr. Aluri Gautam Rao - Guntur  |  November 4, 2009 at 10:04 pm

    Mr. Phanikumar,

    We can’t direct someone to stop talking, thinking and restrict expressing opinions and concerns. It is our fundamental right to free-of-speech.

    And also stop thinking like any other from Andhra and stop being a dictator, ruler, autocrat and head of state. You need to realize the facts.

    “Andhra Pradesh consists of three regions i.e. Andhra, Rayalaseema and Telangana. These represent distinct characters in terms of aspirations, language and social – political and cultural articulations and ruled by two different administrations for ages. The coastal Andhra, Rayalaseema were under Madras Presidency, Telangana was under-Nizam rule.”

    The M.L.A.s from Andhra and Rayalaseema are in the majority in the state Assembly and naturally the decision making goes to the majority in any party. So the wealth, water, mines and jobs of the Telangana area had been appropriated by the representatives and people of Andhra.

    As a result the area which was the third wealthiest state of the world became the poorest region within a span of sixty years. This was because of the colonial blunder by the people from the Andhra area (from which you and I belong to).

    Our quite natural dominant behavior clearly suppressing the interests of Telangana people. Enough is enough. Now we should quit Telangana!!!

    And now please stop this inappropriate and completely biased debate.

    By the way – my family immigrated from Guntur in Andhra area and I lived my entire life at Luxettipet of Adilabad District in Telngana area. I have seen the struggles of our dominance in Telangana region and fully deserve to comment on this debate.

    By -
    Dr. Aluri Gautam Rao

  • 69. Phanikumar  |  November 4, 2009 at 10:38 pm

    @Dr. Aluri Gautam Rao – Guntur
    Well, the intention of the topic was completely different from what it currently being discussed about. I do not intend to continue this thread.

    With all due respect, I clearly deny that the discussion was inappropriate. I can start another chain taking on point by point you mentioned by presenting a different angle, but surely this thread is not a place for that.

    FYI, my father had grown up in Telangana (and belongs to Telangana as per GO 610), and he clearly saw how the selfish motives are misusing some aspects of the movement (he saw because he himself was a beneficiary). While I fully support the separate state movement, I vehemently deny that the common people of Andhra/Seema have to suffer for causes that they are not responsible for….
    (This will be the last comment on this thread.. Apologies if someone had intentions to present their views.. This topic has deviated far enough…)
    (I also deleted the comment “The Historical Necessity of the Small States” for its too big size .. I completely agree that small states are a must for better administration and resource utilization.. Thanks…)

Trackback this post


Categories

Blogroll

Friends

General

Feeds

 

October 2009
M T W T F S S
« Jun   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Recent Posts

Firefox 3