Archive for December, 2009

నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!!

(ఇది ఆనందిని గారి టపా http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html కి జవాబు.. రాయడం మొదలెడితే మరీ పెద్దదయ్యి కూర్చుంది.. అందుకని కొత్త టపా..!)

విశ్లేషణ బాగుంది .. కానీ, మీ టపాలో కొన్ని విషయాలని పాయింట్ చెయ్యాలి …నేను వ్యక్తిగతం గా రెండు లేదా మూడు రాష్ట్రాలకి వ్యతిరేకం కాదు, కానీ చాలా విషయాలలో మీరు చూపించినది నాణానికి ఒక  వైపు మాత్రమే..

1. సంస్కృతి-చిన్న చూపు : మీరు ఒక్క కృష్ణ, గుంటూరు తెలుగు తో పోల్చి అంటున్నారు.. మన అదృష్టమో, దురదృష్టమో గానీ.. తెలుగు కి చాల యాసలున్నాయి.. అది ఉత్తరాంధ్ర కావొచ్చు, గోదావరి జిల్లాలు కావొచ్చు, రాయల సీమ కావొచ్చు.. సమస్య, ఏదో కృష్ణ గుంటూరు యసలని ఒక “బెంచ్ మార్క్” టైపు లో తీసుకోవడం వల్ల వచ్చింది.. ఇది తెలంగాణా యాస ఒక్క దానికి సంబంధించిన సమస్య కాదు… (సో వాట్, మాకు మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు అనొద్దు)
2 . “తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి.” — ఇది “ideal situation” నా ఉద్దేశం లో..  జరగాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు.. ఇప్పుడు అలా జరగటం లేదు కూడా.. చిన్న ఉదాహరణ.. తూర్పు గోదావరి లో ఉన్నా కాలేజీ లలోకి చాల మంది ఉత్తరాంధ్ర కుర్రాళ్ళు వచ్చి చదువుతూ ఉంటారు.. వాళ్ళందరినీ వేరేగా చూడటం, ఆట పట్టించటం చాలా చాలా కామన్.. వాళ్ళ పండగలు కూడా కొన్ని వేరేగా ఉంటాయి….ఇదే పరిస్థితి తూగో కుర్రాళ్ళది వైజాగ్ లో.. :) టిట్ ఫర్ టాట్ మరి..!!
సరే రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని..దానికి ఒక్క ఆంధ్ర వాళ్లనే తప్పు పట్టడం సరైనది కాదు..  ఈ మధ్య మీడియా పుణ్యమా అని కాస్త అక్కడి ఆడవాళ్ళు దసరా టైం లో బతుకమ్మ ప్రోగ్రాం లు ఆసక్తి గా చూడటం అవీ జరుగుతున్నాయి.. కొంతలో కొంత బెటర్…
౩. “తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్‌గా మారిపోతుంది..” — మీరు మరీ generalize  చేస్తున్నట్టు అనిపించట్లేదా?!!  ఏదో ఆంధ్ర వాళ్ళందరూ dominating characters  టైపు లో!!
4. “ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది… ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, వుమెన్‌‌సకాలేజీ, హైకోర్టు, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, దిల్‌కుశ్‌ గెస్‌‌టహౌస్‌, పురానాపూల్‌, నయాపూల్‌, మక్కామసీదు, హుస్సేన్‌సాగర్‌,”.. చాలా సింపుల్ గా తీసి పారేశారు కదండీ..! ఇది రాజధానే గా… దీన్ని మైంటైన్ చెయ్యడానికి ప్రజల పన్నులేగా వాడేది.. అది ఒక్క తెలంగాణా వాళ్ళేం కట్టలేదుగా..
అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లై ఓవర్ లు,  హైటెక్ సిటీ,  ఇంత infrastructure, ఇన్ని investments ఊరికే రావుగా… ఈ విషయం మాత్రం మీరు అర్ధం చేసుకోవాలి.. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు, పెట్టుబడులు పెట్టె పారిశ్రామిక వేత్తల తో పాటు, ఉద్యోగార్ధులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వస్తారు…. హటాత్తుగా ఇది మీది కాదు అంటే ఎవడికైనా కాలుతుంది…. ఇది రాజధాని కాబట్టి, ఇక్కడ బెటర్ opportunities ఉన్నాయి కాబట్టి, సొంతూల్లో పోలాలమ్మి అయినా వస్తారు.. ఇది నీ ఏరియా కాదు అంటే అంత తేలిగ్గా కుదిరే వ్యవహారం కాదు…
5. ” ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే… ” — కించ పరచడం, అవమానాలు గురించి మాట్లాడిన మీరే, ఇదే టపాలో మీరే ఆంధ్ర ప్రజలని కించ పరిచారు.. ఔరా! రాజధాని అప్పటిలాగే ఏ కర్నూల్ లోనో, లేకపోతె విజయవాడ లోనో ఉండి ఉండాల్సింది.. అప్పుడు తెలిసేది ఎవరు ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చేదో..!!
6 “ఎందుకింత బేలతనం..?” — నిజమే, బేలతనమే, తమ హక్కుల కోసం పోరాడ లేని బేలతనం.. అన్నీ ఒకప్పుడు మద్రాస్ కి, ఇప్పుడు హైదరాబాద్ కి తరలిస్తుంటే మాట్లాడలేని బేల తనం… ఓ  హైటెక్ సిటీ, ఓ NIT, ఓ IIIT, ఓ IIT లేకుండా అన్నీ పక్క వాడికే ఇస్తుంటే, అందరూ మనవాళ్ళే అప్పుడు అనుకుని, ఇప్పుడేమో వాడు ఛీ పో అంటుంటే ఏం చెయ్యాలో తెలియని బేల తనం.. అమాయకత్వానికి మంచి శాస్తే జరిగింది.. ఇక ముందైనా తెలివి గా ఉండాలి..
7 మీ అనుకోలు – “రెండు జాతులు” అనేదే సరి కాదు.. తెలుగు వాళ్ళందరూ ఒకటే జాతి.. వేర్వేరు పాలకుల కింద ఉండటం మూలాన వేర్వేరు అలవాట్లు, కొంతమటుకు సంస్కృతి వచ్చాయి..  అలా కాదు అంటారా, జాతి అంటే మీ నిర్వచనం చెప్పండి మరి..!
8 ” హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల గురించి మాట్లాడకపోవడం”..  మిగతా ప్రాంతాలతో పెద్దగా సంబంధాలు లేవు కాబట్టి ముందు గుర్తొచ్చేది హైదరాబాదే.. అదీ కాక చాలా మంది “సెటిలర్స్” ఉన్నారు గా అక్కడ…సరే ఆంధ్ర/సీమ నాయకులు ఏదో చిత్త శుద్ధి తో మాట్లాడుతున్నారని నేను అనను..

ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నా.. ఇంతకాలం నోర్మూసుకుని కూర్చుని ఇప్పుడు హడావుడిగా సమైక్యాంధ్ర అంటే అటు ఆంధ్ర/సీమ ఇటు తెలంగాణా ప్రజలు ఇద్దరికీ చిరాకే.. అంతకు ముందు అన్నీ పార్టీలు తెలంగాణాకి అనుకూలం అని ప్రకటించారు… నా ఉద్దేశం లో అప్పుడు ప్రజాభిప్రాయం (ఆంధ్ర/సీమ వాళ్ళ ది ముఖ్యం గా) పట్టించుకోలేదు .. జనాలు కూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు..ఇప్పుడు హటాత్తుగా రాష్ట్ర ఏర్పాటు విధానం ప్రారంభం అని ప్రకటించేసరికి ఎవ్వరికీ ఊపిరి ఆడట్లేదు.. అంతే!!

ఏది ఏమైనా,
రాజధాని హైదరాబాద్ కాకుండా ఉండి ఉంటే, ఇంత గోల అయ్యేదే కాదా.. ఇంకో రాష్ట్రం ఇవ్వడానికి..?!!
(ఏమో, అప్పుడు ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం కావాలనీ, తెలంగాణా వాళ్ళు వద్దనీ అనొచ్చేమో!)

నాకు అర్ధంయ్యినంతవరకు, ఇప్పుడు కొత్త రాష్ట్రం కావాలి అంటే, ఆంధ్ర/సీమ వాళ్ళని ఒప్పించడం ఒక్కటే మార్గం…(concensus)!!

December 15, 2009 at 12:05 am 11 comments


Categories

Feeds

 

December 2009
M T W T F S S
« Oct   Jul »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Recent Posts

Firefox 3

Follow

Get every new post delivered to your Inbox.